Prabhas: టిక్కెట్ ధరల పెంపు కోసం హైకోర్టుకు 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాల నిర్మాతలు

Prabhas Raja Saab Chiranjeevi films approach High Court for ticket price hike
  • సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న ప్రభాస్, చిరంజీవి సినిమాలు
  • టిక్కెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి కోసం కోర్టులో పిటిషన్
  • బుధవారం విచారణ చేపట్టనున్న హైకోర్టు డివిజన్ బెంచ్
తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్' చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ నటించిన 'రాజాసాబ్', చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాలు విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్మాతలు ఇదివరకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

టిక్కెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రెండు చిత్రాల నిర్మాతలు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరారు. టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా, కోర్టు అందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

కాగా, 'రాజాసాబ్' సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగా (జనవరి 8) రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇవ్వాలని కోరింది.
Prabhas
Raja Saab
Chiranjeevi
Manushankara Varaprasad
Ticket prices hike
Tollywood
Sankranti releases

More Telugu News