Akbaruddin Owaisi: ఏపీ లేకుంటే తెలంగాణ బతకలేదని ఒకరు చెప్పారు.. మేం ఎలా అభివృద్ధి చెందామో చూడండి: అక్బరుద్దీన్ ఒవైసీ

Akbaruddin Owaisi Slams Claims Telangana Cant Survive Without AP
  • తెలంగాణ ఏర్పడితే నీళ్లు, విద్యుత్ ఉండదని ఆ నేత చెప్పాడన్న అక్బరుద్దీన్
  • ఆయన పేరు తాను చెప్పదలుచుకోలేదని వ్యాఖ్య
  • కాంగ్రెస్ సీఎంగా ఆ మాటలు చెప్పి ఆ తర్వాత బీజేపీలో చేరారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లేకుండా తెలంగాణ మనుగడ సాగించలేదని పన్నెండేళ్ల క్రితం ఒక నాయకుడు వ్యాఖ్యానించారని, అయితే ఈ కాలంలో తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము లేకుంటే తెలంగాణకు విద్యుత్ ఉండదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, విద్యుత్ ఉండవని చెప్పారని తెలిపారు.

ఆయన పేరును ప్రస్తావించదలుచుకోలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన వాషింగ్‌ మెషీన్ పార్టీ అయిన బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారారని తెలిపారు. 

అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని మాటలను కావాలని తొలగిస్తున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. తాను ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్న సమయంలో ఆడియో డిస్టర్బెన్స్ వస్తోందని అన్నారు. హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
Akbaruddin Owaisi
Telangana
Andhra Pradesh
Kiran Kumar Reddy
BJP
Assembly

More Telugu News