జేబులో రూ.24తో ముంబయికి.. కేబీసీలో రూ.కోటి గెలిచిన కూలీ కొడుకు.. కన్నీళ్లు పెట్టించే భూషణ్ థాకరే కథ!
Advertisement
- కేబీసీ 18వ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా నిలిచిన భూషణ్ థాకరే
- తన చదువు కోసం తల్లి అమ్మిన నగలను తిరిగి కొనివ్వడమే మొదటి లక్ష్యమని వెల్లడి
- తండ్రితో మళ్లీ కూలి పని చేయించవద్దని అమితాబ్ బచ్చన్ సలహా ఇచ్చారన్న భూషణ్
- ఒకప్పుడు చిన్న సాయానికి కూడా నిరాకరించిన బంధువులు ఇప్పుడు పొగుడుతున్నారని వ్యాఖ్య
అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 18వ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా ఓ యువకుడు నిలిచాడు. అత్యంత పేద నేపథ్యం నుంచి వచ్చిన భూషణ్ థాకరే, కోటి రూపాయల మైలురాయిని అందుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అయితే, ఈ గెలుపు కేవలం డబ్బుకు సంబంధించినది కాదని, ఏళ్లుగా తన తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక కష్టాలకు ఇది చరమగీతం పాడుతుందని ఆయన భావోద్వేగంతో తెలిపాడు. 'హిందుస్థాన్ టైమ్స్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భూషణ్ తన ప్రయాణంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
అకౌంట్‌లో రూ. 24 ఉన్న రోజుల నుంచి.. కేబీసీలో కోటీశ్వరుడిగా..
ఒకప్పుడు తన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.24 ఉన్న రోజుల నుంచి అమితాబ్ బచ్చన్ ఎదురుగా హాట్ సీట్‌లో కూర్చోవడం వరకు తన ప్రయాణాన్ని భూషణ్ గుర్తుచేసుకున్నారు. మొదట్లో అమితాబ్ బచ్చన్‌ను చూసి తీవ్రమైన ఆందోళనకు గురయ్యానని, మాటలు కూడా సరిగా రాలేదని చెప్పారు.
"ఆయన ముందు కూర్చున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ, ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న అమిత్ జీ వెంటనే ప్రశ్నలు అడగలేదు. నా కుటుంబం, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి నన్ను ప్రశాంతంగా మార్చాకే ఆట ప్రారంభించారు. ఆయన సహకారం లేకపోతే, సమాధానాలు తెలిసినా తప్పు చేసేవాడినేమో" అని భూషణ్ వివరించాడు.
అమిత్ జీ సలహా.. అమ్మానాన్నల కష్టాలు తీర్చడమే లక్ష్యం
కోటి రూపాయలు గెలిచిన క్షణాన్ని మాటల్లో వర్ణించలేనని భూషణ్ తెలిపారు. "అమితాబ్ జీ నన్ను ఆలింగనం చేసుకున్నప్పుడు, నేను నా తల్లిదండ్రుల కష్టాలన్నింటినీ దూరం చేశానన్న ఆలోచనే నా మదిలో మెదిలింది. ఆ క్షణం నా జీవితంలో మరచిపోలేనిది" అని అన్నారు. గెలుపు తర్వాత అమితాబ్ తనకో అమూల్యమైన సలహా ఇచ్చారని భూషణ్ చెప్పాడు.
ఇకపై మీ నాన్నగారితో రోజువారీ కూలి పని చేయించవద్దని, కుటుంబ బాధ్యతలు నువ్వే తీసుకుని, వారికి విశ్రాంతి ఇవ్వమని అమిత్ జీ ప్రత్యేకంగా చెప్పారు. ఆయన సలహాను జీవితాంతం పాటిస్తానని పేర్కొన్నాడు.
ఈ ప్రైజ్ మనీతో తాను చేయాలనుకుంటున్న మొదటి పని తన తల్లి కోసం నగలు కొనడమేనని భూషణ్ భావోద్వేగంతో చెప్పాడు. "నా చదువుకు డబ్బు అవసరమైన ప్రతిసారీ, అమ్మ కొద్దికొద్దిగా దాచుకుని కొన్న నగలను అమ్మివేసేది. అలా ఎన్నోసార్లు అమ్మ నగలను నేనే తీసుకెళ్లి అమ్మాను. అవన్నీ ఆమెకు తిరిగి ఇవ్వగలనా లేదా అనే భయం నాలో ఎప్పుడూ ఉండేది. ఈ రోజు కేబీసీ నన్ను ఆ వాగ్దానాన్ని నెరవేర్చే స్థాయికి చేర్చింది" అని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.
ఒకప్పుడు హేళన చేసిన బంధువులు.. ఇప్పుడు పొగడ్తలు
ఈ గెలుపు తర్వాత తన బంధువుల ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చిందని భూషణ్ తెలిపాడు. "ఒకప్పుడు వెయ్యి రూపాయలు అడిగితే హేళన చేసిన బంధువులంతా ఇప్పుడు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. మన ఊరికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచావని పొగుడుతున్నారు. షో తర్వాత ప్రజల ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది" అని ఆయన అన్నాడు.
ఇంకా తన గ్రామానికి వెళ్లలేదని, కానీ అక్కడి ప్రజలు తనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిందని, తన తల్లిదండ్రులను, స్నేహితులను కలుసుకునేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని భూషణ్ తెలిపాడు.
కోటి రూపాయలు గెలిచిన తర్వాత రూ. 7 కోట్ల ప్రశ్నను కూడా భూషణ్ ఎదుర్కొన్నారు. "ఆ సమయంలో నాలో భయం, ఆనందం రెండూ ఉన్నాయి. ఇన్నేళ్లు చదివిన అంశాల నుంచి ప్రశ్న వస్తుందా లేదా బయటి నుంచి వస్తుందా అని భయపడ్డాను. కానీ, కోటి రూపాయలు గెలుచుకోవడమే నాకు అతిపెద్ద విజయం. ఆ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను" అని భూషణ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.