నాన్నను చంపేందుకే సెక్యూరిటీ తీసేశారు: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
Advertisement
- బిహార్ పర్యటనలో కాన్వాయ్‌పై రాళ్లదాడిని గుర్తుచేసిన సోనియా
- స్కూల్‌లో బాబాయ్‌ని తిట్టిన పిల్లాడి చెంప పగలగొట్టిన ప్రియాంక
- 2004లో ప్రధాని పదవిని వదులుకోవడంపై సోనియా స్పష్టత
- గాంధీ కుటుంబం పంచుకున్న 23 నిమిషాల వీడియో వైరల్
‘‘మా నాన్నను చంపడానికే కావాలని భద్రత తొలగించారు.. ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు. ఇదంతా పక్కా కుట్ర!’’ అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య వెనుక నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఆత్మకథ నేపథ్యంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూర్చొని మాట్లాడుకున్న 23 నిమిషాల ప్రత్యేక వీడియోను మంగళవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో బిహార్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, బండరాళ్లతో దాడి జరిగిందని సోనియా గాంధీ ఈ సంభాషణలో గుర్తుచేశారు. ఆ పర్యటనలో తండ్రితో పాటే ఉన్న చిన్ననాటి రాహుల్.. ఇంటికి రాగానే కుటుంబంతో ఆందోళన పంచుకున్నారు. "నాన్న భద్రత కోసం ఏదైనా చేయకపోతే త్వరలోనే ఆయన అంత్యక్రియలకు వెళ్లాల్సి వస్తుంది" అని హెచ్చరించినట్లు రాహుల్ వెల్లడించారు. రాజీవ్ గాంధీ హత్యకు అనుకూలంగా కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టించారని, కావాలనే భద్రతను ఉపసంహరించారని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ వీడియోలో గాంధీ కుటుంబం పలు వ్యక్తిగత, రాజకీయ అనుభవాలను పంచుకుంది. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ ఓటమి చెందిన రోజుల్లో పాఠశాలలో ఎదురైన చేదు అనుభవాన్ని ప్రియాంక గాంధీ గుర్తుచేసుకున్నారు. స్కూల్‌లో ఓ బాలుడు వచ్చి "మీ బాబాయ్ దొంగ.. జైల్లో ఉన్నాడు" అని అవమానించగా, తాను గట్టిగా చెంపదెబ్బ కొట్టినట్లు ఆమె తెలిపారు. తామిద్దరి స్వభావాలు భిన్నమని, తాను నిబంధనలు పాటిస్తే రాహుల్ తనకిష్టమైనట్లు ఉండేవాడని ప్రియాంక చెప్పారు.
2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు తాను ప్రధాని పదవిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో సోనియా గాంధీ స్పష్టత ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పదవిని పట్టుకుని వేలాడేందుకు ఎవరైనా కారణాలు వెతుక్కుంటారని ఆమె వ్యాఖ్యానించారు. తాను ప్రధాని కావాలని కోరుకున్న ప్రజలకు అన్యాయం చేశానన్న భావన కూడా తనలో కలిగిందని పేర్కొన్నారు. తన ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పోరాటాల గురించి కూడా ఆమె వివరించారు. తన పిల్లలు రాహుల్, ప్రియాంక తమ జ్ఞాపకాలను జోడించడంతో ఈ పుస్తకానికి పూర్తి జీవం వచ్చిందని సోనియా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.