శర్వానంద్‌తో వైరల్ ఫొటోపై డింపుల్ హయతి స్పందన

Entertainment
Advertisement
  • శర్వానంద్ భుజంపై డింపుల్ హయతి తలవాల్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
  • డింపుల్ హయతికి వివాహమైందంటూ కామెంట్ చేసిన నెటిజన్
  • తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ స్పష్టతనిచ్చిన నటి
టాలీవుడ్ నటి డింపుల్ హయతి తన వైవాహిక జీవితంపై వస్తున్న ప్రచారానికి తెరదించారు. తనకు ఇంకా వివాహం కాలేదని ఆమె స్పష్టం చేశారు. శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన ‘భోగి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో, ఈ అంశంపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన ‘భోగి’ చిత్ర ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ వేడుకకు చిత్ర బృందం హాజరైంది. ఈ కార్యక్రమంలో శర్వానంద్ భుజంపై డింపుల్ హయతి చనువుగా తల వాల్చి నవ్వుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన ఒక నెటిజన్.. శర్వానంద్‌కు పెళ్లయినట్లే డింపుల్ హయతికి కూడా వివాహం జరిగిపోయింది కదా అంటూ కామెంట్ చేశాడు.

ఆ కామెంట్‌పై డింపుల్ హయతి నేరుగా స్పందిస్తూ... "నాకు ఇంకా పెళ్లి కాలేదు" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో సమాధానమిచ్చారు. గతంలో చోటుచేసుకున్న కొన్ని వివాదాల సమయంలో విక్టర్ డేవిడ్ అనే వ్యక్తిని ఆమె భర్తగా కొన్ని వార్తా కథనాల్లో పేర్కొన్నారు. దీంతో చాలామంది ఆమెకు పెళ్లయిపోయిందని భావించారు. తాజాగా డింపుల్ స్వయంగా స్పందించడంతో ఆ వదంతులకు ముగింపు పడింది.

మరోవైపు, సంపత్ నంది దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'భోగి' చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement

సంబంధిత వార్తలు

Dimple HayathiSharwanandDimple Hayathi marriage rumorsBhogi movieBhogi trailer launchTollywood news

More Telugu News

కూతురి పరీక్షకు తండ్రే ఇన్విజిలేటర్.. నిబంధనల ఉల్లంఘనపై విచారణ

24 Nov, 11:07

భారత్‌లో భారీ ఉద్యోగ కోతల వార్తలను ఖండించిన గూగుల్.. 'సుమారు 30 పోస్టులే తొలగింపు'

24 Nov, 11:04

భోగాపురం వద్ద ఘోర‌ రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

24 Nov, 11:03

శాండ్‌పేపర్‌గేట్ వివాదం: కమిన్స్‌ ఐపీఎల్‌ ఆడతాడా? సహచర ఆటగాడి బిగ్ అప్‌డేట్!

24 Nov, 10:55

జనసేనకు జై కొట్టిన వైసీపీ.. ఎక్కడో కాదు మంత్రి నియోజకవర్గంలోనే!

24 Nov, 10:54

తిరుమల చరిత్రలోనే భారీ విరాళం.. చంద్రబాబు సమక్షంలో రూ. 160 కోట్ల స్వర్ణాభరణాలను సమర్పించనున్న భక్తుడు

24 Nov, 10:46

అత్త గౌరవిస్తే కోడలు ఇలా రాస్తారా?: సోనియా గాంధీకి సావర్కర్ ఫ్యామిలీ లీగల్ నోటీసులు

24 Nov, 10:44

సేవలోనూ ఒక్కటైన టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సీ.. 20 సంస్థలకు రూ. 241 కోట్ల భారీ విరాళం!

24 Nov, 10:41

భారత్‌తో యుద్ధంలో పాక్‌కు చైనా అండ.. అమెరికా నివేదికలో కీలక విషయాలు!

24 Nov, 10:39

యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు.. అధిక ఛార్జీలకు చెక్

24 Nov, 10:20

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రెండు కీలక సమావేశాలు

24 Nov, 10:10

ప్రపంచాన్ని కదిలించిన పెలికోట్‌కు మరో షాక్.. దిగ్భ్రాంతికి గురయ్యానన్న బాధితురాలు

24 Nov, 10:08

ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీ ప్రమాదంలో 24 మంది మృతి

24 Nov, 10:06

గ్రౌండ్‌లో బుమ్రా ఫన్నీ రియాక్షన్: 'ఎలా పట్టాలిరా బాబూ?'.. వైరల్ అవుతున్న వీడియో!

24 Nov, 09:58
..More Telugu News