కూకట్‌పల్లిలో హుడా ట్రక్ పార్కింగ్ స్థలం వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈటల రాజేందర్ ధర్నా
Advertisement
- ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ తరహాలో అమ్మడం సరికాదన్న ఈటల రాజేందర్
- నియోపోలిస్, గచ్చిబౌలి, ఐడీఎల్ భూముల వ్యవహారాలపై విచారణకు డిమాండ్
- భావితరాల కోసం ప్రభుత్వ భూములను కాపాడాలని వ్యాఖ్య
ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాదిరిగా విక్రయించడం ఎంతమాత్రం సరికాదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని వై జంక్షన్ మెట్రో వద్ద ఉన్న ఉన్న హుడా ట్రక్ పార్కింగ్ స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం ఇలా వేలం వేసుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రజలకు, రాబోయే తరాలకు ఖాళీ స్థలాలే లేకుండా పోతాయని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించాలి తప్ప, ఆదాయం కోసం భూములు అమ్మే వ్యాపార సంస్థల్లా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములతో పాటు ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను ప్రభుత్వం బాధ్యతాయుతంగా కాపాడాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో జరిగిన భూ కేటాయింపులపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నియోపోలిస్, గచ్చిబౌలి, ఐడీఎల్, ఎల్లమ్మబండ, భాగ్యనగర్ పరిధిలోని వివాదాస్పద భూముల వ్యవహారాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.