తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం.. టీటీడీ చరిత్రలో ఇదే అతిపెద్ద కానుక!

Andhra
Advertisement
  • విరాళం విలువ రూ.160 కోట్ల వరకు అంచనా విలువ
  • పేరు వెల్లడించడానికి ఇష్టపడని అజ్ఞాత భక్తుడు
  • తొమ్మిది ప్రత్యేక సెట్లలో 45 రకాల ఆభరణాల రూపకల్పన
  • నవంబర్ 26న స్వామివారికి సమర్పించేందుకు ఏర్పాట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు అరుదైన, అత్యంత భారీ కానుకను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి విరాళంగా ప్రకటించారు. ఈ నెల 26న (2026 నవంబర్ 26) ఈ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అధికారికంగా అందజేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ160 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

స్వామివారి కోసం మొత్తం 45 రకాల స్వర్ణాభరణాలను 9 ప్రత్యేక సెట్లుగా అత్యంత నైపుణ్యంతో తయారు చేయించారు. ఈ భారీ విరాళాన్ని అందజేస్తున్న భక్తుడు తన పేరును, వ్యక్తిగత వివరాలను వెల్లడించడానికి ఏమాత్రం ఇష్టపడలేదని సమాచారం. గోప్యత పాటిస్తూ పూర్తిగా స్వామివారి భక్తి ప్రపత్తులతోనే ఈ విరాళాన్ని అందజేస్తున్నారు.

ఈ 121 కిలోల ఆభరణాల సమర్పణ వెనుక ఒక ప్రత్యేక విశేషం ఉంది. తిరుమల శ్రీవారి మూలవిరాట్‌కు నిత్య అలంకరణలో ఉపయోగించే బంగారు ఆభరణాల మొత్తం బరువు సుమారు 120 కిలోల వరకు ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఆ భక్తుడు, మూలవిరాట్ అలంకరణకు సరిపోయేలా 120 కిలోలకు అదనంగా మరో కిలో కలిపి మొత్తం 121 కిలోల బంగారంతో విశేష ఆభరణాలను సిద్ధం చేయాలని సంకల్పించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Tirumala SrivaruTirumala gold donation121 kg gold donationAnonymous devotee TirumalaTirumala Tirupati Devasthanams160 crore gold ornaments

More Telugu News

అగ్రిగోల్డ్ బాండ్ల ధ్రువీకరణ నవంబర్ 25 నుంచి.. తెలంగాణలో 10 కేంద్రాలు, తీసుకెళ్లాల్సిన పత్రాలివే!

21 Nov, 21:04

ట్రంప్ వాస్తవాలు మాట్లాడడం సంతోషం కలిగించింది: వీహెచ్‌పీ చీఫ్ అలోక్ కుమార్

21 Nov, 20:54

హైదరాబాద్‌లో నాలుగు హోటళ్ల లైసెన్సులు రద్దు.. కారణం ఇదే!

21 Nov, 20:47

మగబిడ్డ పుట్టడంతో నెట్టింట వైరల్ అవుతున్న సమంత పాత వీడియో.. ఆనాటి జోస్యం నిజమైందా?

21 Nov, 20:20

హే రామ్.. ఆంధ్రప్రదేశ్ ను కాపాడు: జగన్

21 Nov, 20:12

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానం క్యాబిన్ లోకి ఇరుముడి తీసుకువెళ్లొచ్చు!

21 Nov, 19:59

కోట నీలిమపై వ్యాఖ్యల వివాదం.. ఒవైసీపై మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

21 Nov, 19:47

కుటుంబం కోసం తయారు చేసిన ప్యూరిఫైయర్ 'కెంట్ ఆర్వో' ఎలా అయ్యింది? ఇండియన్ ఆయిల్ ఇంజినీర్ విజయగాథ

21 Nov, 19:31

2027 గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. భారీ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

21 Nov, 19:21

'ఈఎన్ఈ రిపీట్'లో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ పై శివాత్మిక రాజశేఖర్ ఎమోషనల్

21 Nov, 19:12

ఏపీపై నమ్మకంతో ఇంతటి భారీ పరిశ్రమ ఏర్పాటు చేసిన రిలయన్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు: లోకేశ్

21 Nov, 19:02

రైలు పక్కనే నడుస్తూ కుమార్తెకు వీడ్కోలు పలికిన తల్లిదండ్రులు.. ఎమోషనల్ వీడియో వైరల్

21 Nov, 18:54

వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్.. ముగ్గురు నేతలు అలగడం నాకు నచ్చలేదు: సీఎం చంద్రబాబు

21 Nov, 18:35

'అన్బిల్ అవన్' (సోనీలివ్) మూవీ రివ్యూ!

21 Nov, 18:33
..More Telugu News