శ్రద్ధా కపూర్‌కు క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్.. అసలు ఏం జరిగింది?
Advertisement
- డిసెంబర్ 4న ఒకే రోజు సల్మాన్, శ్రద్ధా కపూర్ సినిమాల విడుదల
- బాక్సాఫీస్ క్లాష్‌పై శ్రద్ధా కపూర్‌కు క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్
- విడుదల తేదీ ముందే తెలిస్తే పోటీ పడేవాడిని కాదన్న సల్మాన్
- రెండు సినిమాలకు చోటు ఉంటుందంటూ హుందాగా స్పందించిన శ్రద్ధా
- శ్రద్ధా సినిమా 'ఈత'ను చూడాలంటూ ప్రేక్షకులకు సల్మాన్ పిలుపు
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎదురైన అనూహ్య పోటీపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించాడు. తన తాజా చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్', శ్రద్ధా కపూర్ నటిస్తున్న 'ఈత' సినిమాలు రెండూ డిసెంబర్ 4న ఒకే రోజు విడుదలవుతుండటంపై విచారం వ్యక్తం చేశాడు. అదే తేదీన శ్రద్ధా సినిమా విడుదలవుతున్న విషయం విడుదల తేదీ ప్రకటించే సమయంలో తనకు తెలియదని సల్మాన్ వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆమెకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలిపాడు.
ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన సందర్భంగా సల్మాన్ ఈ వివరాలను పంచుకున్నాడు. డిసెంబర్ 4న శ్రద్ధా సినిమా రిలీజ్ అవుతోందని ముందే తెలిసి ఉంటే, క్లాష్ రాకుండా తాను కచ్చితంగా వేరే తేదీని ఎంచుకునేవాడినని చెప్పాడు. ఆమె చిన్నప్పటి నుంచి తమ కళ్ల ముందే పెరిగిందని గుర్తుచేసుకున్నాడు. అందుకే పరిస్థితిని అర్థం చేసుకుని నేరుగా ఫోన్ చేసి మాట్లాడానని అన్నాడు. శ్రద్ధా కూడా ఎంతో హుందాగా స్పందిస్తూ.. రెండు చిత్రాలు ఒకేసారి వచ్చినా బాక్సాఫీస్ వద్ద తగినంత ఆదరణ దక్కుతుందని భరోసా ఇచ్చినట్లు సల్మాన్ పేర్కొన్నాడు. ఆమె సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని ప్రేక్షకులను కోరుతూ ఆమె ప్రాజెక్ట్‌కు మద్దతు పలికాడు.
సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి' చిత్రం యూఏ 16+ సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. దేశ సరిహద్దుల్లో పోరాడే కల్నల్ సందీప్ శౌర్యం, ఆయన వెన్నంటే ఉండి కుటుంబాన్ని నడిపించే భార్య త్యాగం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. మరోవైపు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈత' చిత్రంలో శ్రద్ధా కపూర్ మహారాష్ట్ర ప్రసిద్ధ లావణి కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గావ్కర్ పాత్రను పోషించారు. మాడాక్ ఫిల్మ్స్, కత్‌పుత్లీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌దీప్ హుడా, నానా పటేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.