రూ.23 లక్షల ప్యాకేజీ నుంచి నెలకు రూ.60 వేలకే.. ఐఐటీ బాంబే టాపర్ కన్నీటి కథ!
Advertisement
- చేరిన కొద్దిరోజులకే స్టార్టప్ మూతపడటంతో కెరీర్‌పై దెబ్బ
- ఐఐటీ పట్టభద్రులకూ తప్పని లేఆఫ్స్ కష్టాలు
- ప్రిపరేషన్‌కు రూ.20 లక్షల కుటుంబ భారం
- ప్రతిభ ఉన్నా దక్కని ఇంటర్వ్యూ అవకాశాలు
- ఏఐ రాకతో ఎంట్రీ లెవల్ కొలువులకు ముప్పు
కళ్లల్లో ఎన్నో ఆశలు, లక్షల రూపాయల కోచింగ్ ఫీజులు, నిద్రలేని రాత్రులు.. వీటన్నింటి ఫలితంగా దేశంలోనే అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో సీటు సాధించాడు సోహమ్ నాయక్. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతూనే కోడింగ్ నేర్చుకుని, స్టార్టప్‌లలో ఇంటర్న్‌షిప్‌లు చేసి ఏటా రూ.23 లక్షల భారీ వార్షిక ప్యాకేజీతో కొలువు దక్కించుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఆ స్టార్టప్ మూతపడటంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాడు.
నెల రోజుల పాటు తీవ్రంగా ఉద్యోగ వేట సాగించినా సరైన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఎక్స్‌లో పెయిడ్ ప్రమోషన్లు, సొంత ప్రోడక్ట్‌లు తయారు చేస్తూ నెలకు కేవలం రూ.60 వేల నుంచి రూ.70 వేలు మాత్రమే సంపాదిస్తున్నాడు. "ఐఐటీ చదివిన వ్యక్తి ఇంకా మెరుగ్గా స్థిరపడాలని మా కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. వారు అసంతృప్తితో ఉన్నారు" అంటూ సోహమ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఐఐటీ ట్యాగ్ ఉన్నా తప్పని లేఆఫ్స్
సోహమ్ కథ ఒక్కడిదే కాదు. ప్రీమియర్ సంస్థల నుంచి పట్టభద్రులైన అనేకమంది యువ ఇంజినీర్ల పరిస్థితి ఇలాగే తయారైంది. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ఐదు నెలల్లోనే స్టార్టప్ లేఆఫ్‌కు గురైన 24 ఏళ్ల మరో ఐఐటీయన్‌కు మూడు నెలలపాటు ఎన్ని దరఖాస్తులు చేసినా కేవలం రెండు ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే వచ్చాయి.
కోడ్‌ఫోర్సెస్ ఎక్స్‌పర్ట్, లీట్‌కోడ్ నైట్‌గా గుర్తింపు ఉన్న మరో పాత ఐఐటీ గ్రాడ్యుయేట్, ఏటా రూ.10 లక్షల ట్రైనర్ ఉద్యోగం వదిలి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వైపు వస్తే ఇంటర్వ్యూ అవకాశాలే లభించడం లేదు. గతంలో అమెజాన్‌లో నెలకు రూ.1.1 లక్షల స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థి సైతం ప్రస్తుతం నెలకు రూ.70 వేలకు మాత్రమే పనిచేస్తున్నాడు. ప్రఖ్యాత డిగ్రీ చేతిలో ఉన్నప్పటికీ మార్కెట్ ఒడుదొడుకులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మధ్యతరగతి తల్లిదండ్రుల గుదిబండ
సాధారణంగా ఐఐటీ లక్ష్యం కోసం 9, 10 తరగతుల నుంచే కోచింగ్ పేరిట లక్షల రూపాయల పెట్టుబడి పెడతారు. కోటా, హైదరాబాద్, ఢిల్లీలలో హాస్టల్ ఖర్చులు, కోచింగ్ ఫీజులు, నాలుగేళ్ల ఐఐటీ ఫీజులు కలుపుకొంటే సగటు మధ్యతరగతి కుటుంబంపై రూ.18 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. తీరా ఇంత భారీ వ్యయం చేసి కొలువుల్లో చేరాక, కొద్ది నెలల్లోనే ఉద్యోగం ఊడిపోవడమో లేదా తక్కువ వేతనాలకే పరిమితం కావడమో వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
సీఎస్‌ఈ, ఏఐ వైపు పరుగులు
మెకానికల్, సివిల్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాలు చదువుతున్న విద్యార్థులు సైతం కేవలం సాఫ్ట్‌వేర్, ఏఐ రంగాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఏఐసీటీఈ సమాచారం ప్రకారం 2024-25లో ఇంజినీరింగ్ ప్రవేశాలు 75.07 శాతానికి పెరిగినప్పటికీ మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్తున్నారు. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెబుతుండగా, ప్రవేశ స్థాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు క్రమంగా కనుమరుగవుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఐటీ డిగ్రీ తలుపులు తెరిపించగలదేమో కానీ, ఆ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయన్న గ్యారెంటీ ఇవ్వలేకపోతోందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.