తాడిపత్రిలో ఉద్రిక్తత: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, వాహనాలకు నిప్పు

Andhra
Advertisement
  • తాడిపత్రిలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు
  • జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులే దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపణ
  • పరిస్థితి విషమించకుండా తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ ఈ పరిణామం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పెద్దారెడ్డి నివాసానికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో పాటు పార్కింగ్‌లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో ఇంటి కిటికీల అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంటి ఆవరణతో పాటు బయట నిలిపి ఉంచిన సుమారు 10 స్కార్పియో కార్లు, 20 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని జనరేటర్‌ను కూడా నిప్పంటించడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

మరోవైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. స్థానిక ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీప గ్రామాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను పరామర్శించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.

పట్టణంలో పరిస్థితి చేజారకుండా పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kethireddy Pedda ReddyJC Prabhakar ReddyTadipatri violenceTadipatri tensionYSRCP leader house attack

More Telugu News

బైక్ ట్యాక్సీల నిషేధానికి సుప్రీం నో.. నిషేధం కన్నా నియంత్రణే మేలని వ్యాఖ్య

20 Nov, 17:23

పవన్ కల్యాణ్ 'ఎంపవర్ స్టార్'.. డిప్యూటీ సీఎం విజన్‌పై ఉపాసన కొణిదెల ప్రశంసలు

20 Nov, 17:16

రూ.21,952 కోట్ల కలెక్షన్లతో ఊచకోత.. గేమింగ్ హిస్టరీని తిరగరాసిన రాక్‌స్టార్ గేమ్!

20 Nov, 17:10

రూ.9 కోట్ల మందు రూ.2.5 లక్షలే.. పసిపిల్లల ప్రాణాల కోసం పోరాడిన హైదరాబాద్ డాక్టర్!

20 Nov, 16:39

కడప జడ్పీ పీఠం వివాదం.. రేపు కీలక నిర్ణయం ప్రకటిస్తానన్న ఆదినారాయణరెడ్డి

20 Nov, 16:23

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 25,800 దాటిన నిఫ్టీ

20 Nov, 16:14

నేను ‘సెహ్వాగ్ 2.0’ కావడానికి రాలేదు.. తండ్రితో పోలికపై ఆర్యవీర్‌ బోల్డ్‌ కామెంట్స్‌

20 Nov, 16:14

ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం

20 Nov, 16:05

నా ఎత్తు, కేటీఆర్ గడ్డం గురించేనా నీ పంచాయితీ?.. సీఎం రేవంత్‌ ప్రసంగంపై భగ్గుమన్న హరీశ్

20 Nov, 15:52

డ్రెస్ కోడ్ పేరుతో అయ్యప్ప స్వామికి నో ఎంట్రీ.. హైదరాబాద్‌ టీసీఎస్ వద్ద భగ్గుమన్న నిరసన!

20 Nov, 15:40

కేసీఆర్ నా కథలో రావణాసురుడు.. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా లీడర్: సీఎం రేవంత్

20 Nov, 15:33

రేవంత్ రెడ్డి పాలనలో క్రైస్తవులు, దళితులపై దాడులు పెరిగాయి: కేఏ పాల్

20 Nov, 15:31

శత్రువులను గడగడలాడించే అమెరికా ఫైటర్ జెట్‌కు.. 256 ఎంబీ మెమరీ కార్డు కావాలట!

20 Nov, 15:22

స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

20 Nov, 15:16
..More Telugu News