కడప జడ్పీ పీఠం వివాదం.. రేపు కీలక నిర్ణయం ప్రకటిస్తానన్న ఆదినారాయణరెడ్డి

Andhra
Advertisement
  • కడప జడ్పీ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడంపై ఆదినారాయణరెడ్డి అసంతృప్తి
  • జమ్మలమడుగు పరిధిలో కూటమి తరఫున 46 స్థానాలకు 46 గెలిపించామని వెల్లడి
  • రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోయాయంటూ ఆవేదన
కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించడంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కడప జడ్పీ పీఠాన్ని టీడీపీకి ఖరారు చేయడంతో కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన ఆదినారాయణరెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను కూటమి కోసం ఎంతో నిబద్ధతతో పనిచేశానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జమ్మలమడుగు పరిధిలో 46 స్థానాలకు గాను 46 స్థానాల్లోనూ విజయం సాధించామని గుర్తుచేశారు. అయితే రాత్రికి రాత్రే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే తనకు అర సెకన్ కూడా పట్టదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అధిష్ఠానంతో చర్చిస్తానని, తన తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పదవిని తన సోదరుడి కుమారుడు డాక్టర్ చాదిపిరాళ్ల రాజేశ్ రెడ్డికి కేటాయిస్తారని ఆదినారాయణరెడ్డి ఆశించారు. అయితే అనూహ్యంగా వేరొకరికి కేటాయించడంతో ఈ వివాదం మొదలైంది. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో ఆదినారాయణరెడ్డి స్వయంగా మాట్లాడారు. తన నిర్ణయం మార్చుకోనేది లేదని స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Adinarayana ReddyKadapa ZP ChairmanBJP TDP AllianceAndhra Pradesh Politics

More Telugu News

పవన్ కల్యాణ్ 'ఎంపవర్ స్టార్'.. డిప్యూటీ సీఎం విజన్‌పై ఉపాసన కొణిదెల ప్రశంసలు

20 Nov, 17:16

రూ.21,952 కోట్ల కలెక్షన్లతో ఊచకోత.. గేమింగ్ హిస్టరీని తిరగరాసిన రాక్‌స్టార్ గేమ్!

20 Nov, 17:10

తాడిపత్రిలో ఉద్రిక్తత: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, వాహనాలకు నిప్పు

20 Nov, 16:48

రూ.9 కోట్ల మందు రూ.2.5 లక్షలే.. పసిపిల్లల ప్రాణాల కోసం పోరాడిన హైదరాబాద్ డాక్టర్!

20 Nov, 16:39

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 25,800 దాటిన నిఫ్టీ

20 Nov, 16:14

నేను ‘సెహ్వాగ్ 2.0’ కావడానికి రాలేదు.. తండ్రితో పోలికపై ఆర్యవీర్‌ బోల్డ్‌ కామెంట్స్‌

20 Nov, 16:14

ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం

20 Nov, 16:05

నా ఎత్తు, కేటీఆర్ గడ్డం గురించేనా నీ పంచాయితీ?.. సీఎం రేవంత్‌ ప్రసంగంపై భగ్గుమన్న హరీశ్

20 Nov, 15:52

డ్రెస్ కోడ్ పేరుతో అయ్యప్ప స్వామికి నో ఎంట్రీ.. హైదరాబాద్‌ టీసీఎస్ వద్ద భగ్గుమన్న నిరసన!

20 Nov, 15:40

కేసీఆర్ నా కథలో రావణాసురుడు.. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా లీడర్: సీఎం రేవంత్

20 Nov, 15:33

రేవంత్ రెడ్డి పాలనలో క్రైస్తవులు, దళితులపై దాడులు పెరిగాయి: కేఏ పాల్

20 Nov, 15:31

శత్రువులను గడగడలాడించే అమెరికా ఫైటర్ జెట్‌కు.. 256 ఎంబీ మెమరీ కార్డు కావాలట!

20 Nov, 15:22

స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

20 Nov, 15:16

ఐఎస్ఐ అతిథిగా దావూద్ రాచభోగాలు.. పాక్‌లో డాన్ రహస్య జీవితాన్ని బయటపెట్టిన మాజీ ఎఫ్‌బీఐ అధికారి!

20 Nov, 15:05
..More Telugu News