ముందు కేబినెట్ ఖాళీలను భర్తీ చేయండి: రేవంత్‌ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు

Telangana
  • సిరిసిల్ల, సిద్దిపేటల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామన్న రేవంత్ హామీలపై వేముల విమర్శలు
  • రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటికే 3 పదవులు ఖాళీగా ఉన్నాయన్న వేముల
  • సొంత కేబినెట్‌ను విస్తరించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తామంటూ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు వేశారు.

"రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు. మొన్న సిరిసిల్ల పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అన్నాడు. నిన్న సిద్దిపేట పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అంటున్నాడు. నీ కేబినెట్‌లోనే 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.. ముందు వాటిని భర్తీ చెయ్యి" అని అన్నారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులు ఇవ్వడానికే రేవంత్ కు లాగు తడుస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఏ ఎమ్మెల్యే వెళ్లపోతాడో అని భయపడుతున్నారని అన్నారు.

రాష్ట్ర కేబినెట్‌లో ఇప్పటికే ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను భర్తీ చేయలేని స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి... భవిష్యత్తు ఎన్నికల్లో గెలిస్తే పదవులు ఇస్తామని చెప్పడం సరికాదని ఆయన విమర్శించారు. కేబినెట్ విస్తరణ చేపడితే పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు చేజారిపోతారనే భయంతో ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

Vemula Prashanth ReddyBRS PartyRevanth ReddySircilla SiddipetTelangana Politics

More Telugu News

సిరాజ్‌ను పక్కన పెట్టడం వెనుక మత కోణమా? కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై గంభీర్ కోచ్ క్లారిటీ!

20 Nov, 14:22

అమెరికాలో అత్యంత అరుదైన చేప.. 69 నుంచి 137కు పెరిగిన 'డెవిల్స్ హోల్ పప్‌ఫిష్'

20 Nov, 14:13

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదే..!

20 Nov, 14:07

టాటా గ్రూప్‌లో అధికార పోరు.. లిస్టింగ్‌పై చర్చకు సిద్ధమైన అతిపెద్ద వాటాదారు

20 Nov, 13:54

టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

20 Nov, 13:51

యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి కన్నుమూత

20 Nov, 13:41

ఫ్రాన్స్ మహిళకు వరించిన అదృష్టం.. రూ.2 వేలకు కొన్న దీపం రూ.2.5 కోట్లకు అమ్ముడైంది!

20 Nov, 13:40

సందర్శకుడి టోపీ ప్రాణం తీసింది.. ప్రపంచ ప్రసిద్ధ హిప్పో 'ఫియోనా' మృతి

20 Nov, 13:27

బీటెక్ రవినే మాపై దాడి చేయించారు: అవినాశ్ రెడ్డి

20 Nov, 13:22

చంద్రుడిపై బంగాళాదుంపల సాగు.. వ్యోమగాముల ఆహార భద్రతకు కీలక ముందడుగు!

20 Nov, 13:16

విశాఖ మేయర్ ముక్కా శ్రావణికి పితృవియోగం.. పల్లా, లోకేశ్ సంతాపం

20 Nov, 13:11

రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టొద్దు: మంత్రులను ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

20 Nov, 13:07

అవినాశ్ రెడ్డి 30 నుంచి 40 వాహనాలతో రావాల్సిన అవసరం ఏముంది?: బీటెక్ రవి

20 Nov, 12:58

దిగ్గజ సంస్థలకు సైబర్ సెగ.. వీసా, మాస్టర్‌కార్డ్ కస్టమర్ల డేటా లీక్

20 Nov, 12:43
..More Telugu News