నచ్చిన నంబర్ కావాలంటే ఇక స్పీడ్ పెంచాల్సిందే: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం
Advertisement
- ఫ్యాన్సీ నంబర్ ఎంపిక గడువు 30 రోజులకు తగ్గింపు
- టీఆర్ వచ్చిన నెల రోజుల్లోనే బిడ్డింగ్, పేమెంట్ ముగించాలి
- గడువు తప్పితే సిస్టమ్ ద్వారా సాధారణ నంబర్ కేటాయింపు
- కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి తెచ్చిన రవాణా శాఖ
- వాహన విక్రయ సమయంలోనే వివరించాలని డీలర్లకు ఆదేశం
నచ్చిన ఫ్యాన్సీ నంబర్ కోసం కొత్త వాహనాలకు నెలల తరబడి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పే ఆటలకు తెలంగాణ రవాణా శాఖ గట్టిగా అడ్డుకట్ట వేసింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) తీసుకున్న తర్వాత రోడ్లపై తిరుగుతూ కాలయాపన చేసే ధోరణిని అరికట్టేందుకు తాజాగా నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్ ఎంపిక కోసం కల్పించిన రెండు నెలల సుదీర్ఘ గడువును సగానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై నెల రోజుల్లోపే ప్రక్రియ మొత్తం తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ జారీ చేసిన నూతన ఉత్తర్వులు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
కొత్త నిబంధనల ప్రకారం.. తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ అయిన తేదీ మొదలుకొని సరిగ్గా 30 రోజుల్లోనే నిర్దేశిత నంబర్ రిజర్వేషన్, ఆన్‌లైన్ బిడ్డింగ్, ఫీజుల చెల్లింపు వ్యవహారాలన్నీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గడువు దాటితే వాహనదారుడికి ఎలాంటి ప్రత్యేక హక్కులు ఉండవు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ దానంతట అదే ఒక సాధారణ ర్యాండమ్ నంబర్‌ను కేటాయించేస్తుంది. ఆ తర్వాత ఇక ఫ్యాన్సీ నంబర్ మార్చుకునే అవకాశం ఉండదు. షోరూమ్‌లో బండి డెలివరీ ఇచ్చే సమయంలోనే ఈ కొత్త నిబంధనల గురించి కొనుగోలుదారులకు వివరంగా చెప్పాలని డీలర్లను రవాణా శాఖ అప్రమత్తం చేసింది.
గతంలో 60 రోజుల వెసులుబాటు ఉండటంతో చాలామంది టీఆర్ నంబర్లతోనే దర్జాగా రోడ్లపై వాహనాలను నడిపేవారు. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్, క్రైమ్ పరంగా భద్రతా సమస్యలు తలెత్తడంతో పాటు తదుపరి సిరీస్ నంబర్ల ప్రక్రియ నిలిచిపోయేది. ఈ గడువును నెల రోజులకు తగ్గించడం వల్ల శాశ్వత నంబర్ల కేటాయింపు వేగవంతం కావడమే కాకుండా, బిడ్డింగ్‌లో మరింత పారదర్శకత వచ్చి ప్రభుత్వానికి సకాలంలో ఆదాయం చేరుతుందని రవాణా కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.