గడ్డకట్టే నీటిలో 6 గంటలు.. ‘మాతృభూమి’ సినిమా కోసం సల్మాన్ కష్టాన్ని వెల్లడించిన దర్శకుడు
Advertisement
- గడ్డకట్టే చల్లని నీటిలో రోజుకు ఆరు గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడి
- తడిసిన దుస్తులతోనే సల్మాన్ భోజనం చేశారని చెప్పిన అపూర్వ లఖియా
- సహజత్వం కోసం స్టూడియోకు బదులుగా నిజమైన ప్రదేశంలో చిత్రీకరణ జరిపినట్లు వెల్లడి
- ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సినిమా కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారని మరోసారి నిరూపించారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ షూటింగ్‌లో భాగంగా గడ్డకట్టే చల్లని నీటిలో రోజుకు ఆరు గంటల పాటు గడిపారని దర్శకుడు అపూర్వ లఖియా వెల్లడించారు. తడిసిన దుస్తులతోనే భోజనం చేస్తూ చిత్రీకరణలో పాల్గొన్నారని తెలిపారు.
ఈ సినిమా కోసం తొలుత ముంబైలోని స్టూడియోలో ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరించాలని భావించారట. అయితే సహజత్వం కోసం సెట్‌లో కాకుండా నిజమైన ప్రదేశంలోనే షూట్ చేయాలని సల్మాన్ సూచించడంతో సెప్టెంబర్ చివర్లో చల్లని నీటిలో చిత్రీకరణ జరిపినట్లు దర్శకుడు చెప్పారు. ఆ నీటి ఉష్ణోగ్రత దాదాపు సున్నా డిగ్రీలకు దగ్గరగా ఉందని వివరించారు. సల్మాన్‌తో పాటు ఇతర నటులు చలికి వణికిపోవడం నటన కాదని, నిజంగానే అంతటి చలిని భరించారని పేర్కొన్నారు.
ఈ సన్నివేశాన్ని ఒక్కరోజులో పూర్తి చేయాలనుకున్నా.. రెండున్నర రోజులు పట్టిందని అపూర్వ తెలిపారు. నటీనటులు ఎదుర్కొన్న కష్టాన్ని చూసిన సిబ్బంది, తామే ఆ సీన్ చేస్తున్నంత ఇదిగా చలికి వణికిపోయారని చెప్పారు.
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జియో స్టూడియోస్ ఆల్ ఇండియా పంపిణీ బాధ్యతలు చేపట్టగా, విదేశీ పంపిణీని జీ స్టూడియోస్ నిర్వహిస్తోంది. 2026 డిసెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది.