వైసీపీ నేతల అవినీతిపై వెబ్ సిరీస్ తీస్తే అంతం ఉండదు.. అంతులేని కథలా సాగుతూనే ఉంటుంది: కొల్లు రవీంద్ర

Andhra
Advertisement
  • వైసీపీ నాయకత్వంపై కొల్లు రవీంద్ర ఫైర్
  • పీఏలే వేల కోట్లు దోస్తే యజమాని జగన్ ఇంకెన్ని లక్షల కోట్లు తిన్నారని ప్రశ్న
  • దోచుకున్న ప్రజాధనాన్ని విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లించారని ఆరోపణ
  • సాధారణ ఉద్యోగుల కుటుంబాల పేరిట వందల కోట్ల ఆస్తులు వెలుగులోకి
  • నాసిరకం మద్యంతో వేలాది మంది మహిళలను వితంతువులుగా మార్చారని ఆగ్రహం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, దోపిడీలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదని, అది ఒక అంతులేని కథలా సాగుతుందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాటి పాలనలో జరిగిన అక్రమాలే ఆ పార్టీకి రాజకీయంగా సమాధి కట్టబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.

నాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సూట్‌కేస్ కంపెనీల ద్వారా వ్యవస్థలను ప్రభావితం చేసినట్లే, గత ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జగన్ భారీ అవినీతి సామ్రాజ్యాన్ని నడిపించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలను అవినీతి ఊబిలోకి దింపిన చరిత్ర ఆయనదని విమర్శించారు. 

మాజీ సీఎం కార్యాలయంలో నెలకు కేవలం రూ. 2 లక్షల జీతం తీసుకునే ఉద్యోగుల భార్యలు, కుటుంబ సభ్యులు, అనుయాయుల పేర్ల మీద వందల కోట్ల రూపాయల ఆస్తులు, కంపెనీలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఒక సాధారణ టిఫిన్ బండి నడుపుకునే వ్యక్తికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలు గమనించాలని సూచించారు. కింది స్థాయి పీఏలే వేల కోట్లు దోచుకుంటే, వీటన్నింటికీ యజమానిగా ఉన్న జగన్ ఇంకెన్ని లక్షల కోట్లు దోచుకున్నారో సమాజం ఆలోచించాలన్నారు.

గత ఐదేళ్లలో మద్యం కుంభకోణం, ఇసుక, మైనింగ్, పేదల భూముల ఆక్రమణల ద్వారా దోచుకున్న సొమ్మును విదేశాల్లోని వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని దక్షిణాఫ్రికాలోని మద్యం, మైనింగ్ వ్యాపారాల్లోకి మళ్లించారని, అలాగే ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలకు తరలించారని ఆరోపించారు. 

ఆ నిధులను తిరిగి దేశంలోకి తెచ్చుకోవడానికి దొంగ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, సూట్‌కేస్ కంపెనీలను సృష్టించారని, కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నిధులు తెచ్చి షోరూమ్‌లు, భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ అక్రమ కార్యకలాపాలపై విదేశీ ప్రభుత్వాలు కూడా దాడులు నిర్వహించాయని గుర్తుచేశారు.

గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన 'జే బ్రాండ్స్' నాసిరకం మద్యం వల్ల కిడ్నీ, లివర్ వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చి అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 30 వేల మందికి పైగా మహిళలు చిన్న వయసులోనే వితంతువులుగా మారారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తిలో వాటా అడిగినందుకు సొంత తల్లిని, చెల్లిని బయటకు పంపిన చరిత్ర వారిదని విమర్శించారు. 

ఐదేళ్ల పాటు సాగించిన దోపిడీ, దాడులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవనే భయంతోనే ప్రస్తుత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని దోచుకున్న అసలు శక్తులు అతి త్వరలోనే పూర్తిస్థాయిలో బయటకు వస్తాయని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kollu RavindraYS Jagan Mohan ReddyYSRCP CorruptionAndhra Pradesh PoliticsKollu Ravindra AllegationsYSRCP Liquor Scam

More Telugu News

గడ్డకట్టే నీటిలో 6 గంటలు.. ‘మాతృభూమి’ సినిమా కోసం సల్మాన్‌ కష్టాన్ని వెల్లడించిన దర్శకుడు

16 Nov, 15:22

'పది మంది నవ్వితే ఏంటి.. ఒక్కరు నమ్మితే చాలదా?'.. మనసును హత్తుకుంటున్న ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్

16 Nov, 15:16

ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

16 Nov, 15:05

ఐసీసీ చైర్మన్ పీఠంపై మరోసారి జై షా.. విషెస్ తెలిపిన నారా లోకేశ్

16 Nov, 15:03

సీఆర్‌పీఎఫ్‌ పోస్టుపై దాడి కేసులో కీలక పరిణామం.. ఉగ్రవాది మృతి

16 Nov, 14:46

అమెరికాలో భారతీయులకు మరిన్ని అవకాశాలు.. ట్రంప్‌ వైఖరిపై ఐబీఎం సీఈఓ

16 Nov, 14:41

ర‌జ‌త్ పటీదార్ విధ్వంసం.. 48 బంతుల్లోనే 135 ప‌రుగులు.. రికార్డుల మోత!

16 Nov, 14:37

విశాఖలో కొత్త తరహా మోసం... సోషల్ మీడియా స్నేహంతో నగలు లూటీ చేసిన యువతి

16 Nov, 14:29

బిల్కిస్ బానో కేసు.. 17 ఏళ్ల జైలు తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్

16 Nov, 14:07

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణిపై ఏసీబీ దాడులు.. అక్రమాస్తుల గుర్తింపు

16 Nov, 13:49

హైదరాబాదీలకు బిర్యానీ షాక్.. భారీగా పెరిగిన ధరలు!

16 Nov, 13:41

'ఓం' కోసం జుట్టు కట్ చేయడంతో అమ్మ బాగా బాధపడింది: సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

16 Nov, 13:28

బాంబు బెదిరింపుల వేళ అమితాబ్‌ పోస్ట్‌.. ‘బతికిపోయాం’ అంటూ వ్యాఖ్య

16 Nov, 13:26

వాట్సాప్‌లో ‘జాప్స్‌’ ఫీచర్‌.. చూసిన వెంటనే మాయమయ్యే ఫొటోలు, వీడియోలు!

16 Nov, 13:26
..More Telugu News