నేడు హరీశ్ రావు తండ్రి సంవత్సరీకం.. హాజరైన కేసీఆర్, కేటీఆర్

Telangana
Advertisement
  • కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లిన కేసీఆర్
  • హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి
  • హరీశ్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన గులాబీ బాస్
  • కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించిన కేటీఆర్
  • హాజరైన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఇతర నేతలు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తన మేనల్లుడు హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు తండ్రి దివంగత సత్యనారాయణరావు ప్రథమ వర్ధంతి (సంవత్సరీకం) సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేటలో ఉన్న హరీశ్ రావు స్వగృహానికి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం హరీశ్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఆయన దివంగత సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. వీరితో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలు హాజరై హరీశ్ రావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Harish RaoKCRKTRHarish Rao Father Death AnniversaryKokapetJoginapally Santosh Kumar

More Telugu News

షోరూమ్ ట్రయల్ రూమ్‌లో యువతి మృతదేహం.. మరిదిపై అనుమానం!

15 Nov, 21:17

ఈ కుర్రాడు మరో ధోనీ అవుతాడా?

15 Nov, 21:11

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. హైదరాబాద్, ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు

15 Nov, 21:04

ఏపీ, ఒడిశాలకు తుపాను హెచ్చరికలు జారీ.. 20 రోజుల వ్యవధిలో మూడో ముప్పు!

15 Nov, 20:55

న్యూయార్క్‌కు మళ్లీ ఎయిరిండియా నాన్‌స్టాప్ విమానాలు.. 5 గంటల సమయం ఆదా

15 Nov, 20:31

రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఎస్వీ మ్యూజియం ఎంట్రీ.. ప్రత్యేక ఆకర్షణగా 'బ్రహ్మాండం గ్యాలరీ'

15 Nov, 20:15

అల్లు అర్జున్‌తో ఫొటోలు పంచుకుని మనసులోని కోరిక చెప్పిన ఆషికా రంగనాథ్

15 Nov, 19:59

మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్

15 Nov, 19:46

లేఆఫ్‌లో వెళ్లిపోతానన్నాడు.. 15 నెలల జీతం ఇచ్చి మహారాజులా సాగనంపారు!

15 Nov, 19:20

సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం

15 Nov, 19:12

బ్రేకులు పనిచేయకపోయినా 463 కిలోమీటర్లు ప్రయాణించిన వందే భారత్.. విచారణకు ఆదేశం

15 Nov, 18:53

నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు చెబుతారా?: ధర్మాన

15 Nov, 18:47

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన వాయుగుండం.. ఏపీకి 'అక్వాన్' గండం

15 Nov, 18:21

స్వగ్రామంలో ముగిసిన గిరిబాబు అంత్యక్రియలు.. అశ్రునయనాల మధ్య ఆఖరి వీడ్కోలు

15 Nov, 18:07
..More Telugu News