అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలను పరామర్శించిన అనిత
Advertisement
- అనకాపల్లి జిల్లా కొత్త పోలవరం వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
- ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి నలుగురికి తీవ్ర గాయాలు
- విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనిత
అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కొత్త పోలవరం గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడి విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.
పోలీసుల సమాచారం ప్రకారం... ఎస్. రాయవరం మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కారులో పోలవరం వెళ్లారు. సరదాగా గడిపి తిరిగి వస్తుండగా, కొత్త పోలవరం వద్ద కారు అతివేగం కారణంగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో కురందాసు శ్రీను, కోర్ని శ్రీను అనే ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో కురందాసు ప్రసాద్, బొట్టా సురేంద్ర, కురందాసు శివ, కురందాసు అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో నలుగురినీ అత్యవసర చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు, అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కొత్త పోలవరంకు వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ తర్వాత నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.