రాప్తాడు దాడి బాధితురాలికి వైఎస్ జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం
Advertisement
- తీవ్రంగా గాయపడిన గోపికకు రూ. 5 లక్షల చెక్కు అందజేత
- బెంగళూరు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు చెక్కు ఇచ్చిన నేతలు
- మరో విద్యార్థిని లక్ష్మికి కూడా రూ. 3 లక్షలు అందించిన జగన్
- జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినుల కుటుంబ సభ్యులు
రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపికకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపిక కుటుంబ సభ్యులకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అందజేశారు. తమకు అండగా నిలిచినందుకు వైఎస్ జగన్‌కు గోపిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గోపిక కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఇటీవలే భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఇదే ఘటనలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి గాయపడిన మరో విద్యార్థిని లక్ష్మికి కూడా గురువారం నాడు జగన్ రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ చెక్కును మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులకు అందించారు. కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్నందుకు లక్ష్మి కుటుంబ సభ్యులు కూడా జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.