బకాయిలు పెట్టింది మీరే.. చెల్లిస్తున్న మాపై నిందలా?: జగన్‌పై లోకేశ్ ఫైర్
Advertisement
- చిత్తూరులో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై జగన్, మంత్రి లోకేశ్ మధ్య ఎక్స్ వేదికగా విమర్శలు
- ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు భారీగా ఉన్నాయని జగన్ ఆరోపణ
- అందువల్లే విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారంటూ విమర్శలు
- తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.5 వేల కోట్లు చెల్లించిందని లోకేశ్ కౌంటర్
- సొంత బాబాయి హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు జగన్ వ్యవహారశైలి ఒక్కటేనన్న లోకేశ్
చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలే కారణమంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. జగన్ హయాంలోనే రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో రూ.5 వేల కోట్లు చెల్లించిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇరువురు నేతలు ‘ఎక్స్’ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాల బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ ఆరోపించారు. చిత్తూరు ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్న కళాశాలల యాజమాన్యాలను ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వబోమని, సర్టిఫికెట్లు ఇవ్వబోమని కళాశాలలు హెచ్చరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లతో కొందరు చదువులు మానేసి పనులకు వెళ్తుండగా, మరికొందరు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని విమర్శించారు.
దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. సొంత బాబాయి హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు జగన్ వ్యవహారశైలి ఒక్కటేనని విమర్శించారు. తప్పు చేసి, నిందను ఇతరులపై నెట్టి, అబద్ధాలతో తప్పించుకోవడమే ఆయన పద్ధతని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4 వేల కోట్ల బకాయిలు మిగిలేవి కావని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలోనే రూ.5 వేల కోట్లు చెల్లించిందని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం ప్రతినెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. బకాయిలు చెల్లిస్తున్న తమ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. ఫేక్ ప్రచారంతో వాస్తవాలను మార్చలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న జగన్ చరిత్రను చెరిపేయలేరని విమర్శించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.