Advertisement

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం

Telangana
Advertisement
  • ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
  • సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సజ్జనార్ భావోద్వేగ వీడ్కోలు సందేశం
  • చారిత్రక నగరానికి సీపీగా పనిచేయడం మరచిపోలేనంటూ ట్వీట్
తెలంగాణలో నిన్న భారీ సంఖ్యలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్‌ భగవత్‌ను నియమించారు. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ.. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డీజీగా నియమించింది. దీంతో పాటు ఆయనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) డీజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. బదిలీ నేపథ్యంలో సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నారు.

"గడచిన ఏడాది కాలం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణం. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని సజ్జనార్ పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్న మహేశ్‌ భగవత్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

"ఈ ఏడాది కాలంలో నగర ప్రజలు నాపై, మా పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. మేము చేపట్టిన ప్రతి సంస్కరణనూ తమ సొంత కార్యక్రమంగా భావించి ఎంతగానో ఆదరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్. ప్రజలంతా కలిసిమెలిసి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకున్న తీరు నా మనసును ఎంతగానో కదిలించింది.

ప్రజల క్షేమమే పరమావధిగా మేము అనేక అడుగులు వేశాం. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా ఉక్కుపాదం మోపాం. భారీ ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నంలో మాకు అండగా నిలిచిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు. 

మరోవైపు, సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసుల వల్లే కాదని గుర్తించి... ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, DoT వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ గారు ప్రత్యేకంగా స్పందించి... మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన సలహాలను స్వీకరించి ప్రశంసించడం మనందరికీ దక్కిన గౌరవం.

అలాగే బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా కేసుల దర్యాప్తు కోసం ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాం. భావితరాల బిడ్డల్లో పోలీసుల పట్ల భయం పోయి, సమాజం పట్ల ఒక ఉన్నతమైన స్ఫూర్తి కలగాలని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో చేపట్టిన ‘డే విత్ సీపీ’ కార్యక్రమం నాకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చింది.  

ఇక నగరవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేసి ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలిగించాం. మన ఇంట్లోని ఆడబిడ్డల రక్షణను బాధ్యతగా భావించి మహిళల భద్రత కోసం ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఈ విజయాలన్నింటి వెనుక పోలీస్ కుటుంబం పడిన కష్టం దాగుంది. 

ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించే ‘ఎక్స్‌ట్రా మైల్’, వారి ఆరోగ్య రక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలు వారి త్యాగాలకు మేమిచ్చిన చిరు కానుకలు. శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, సీపీ ఆఫీస్, అడ్మిన్ విభాగాలు సహా... పండుగైనా, పబ్బమైనా తమ సొంత కుటుంబాలను పక్కనపెట్టి రోడ్లపై నిలబడి అహర్నిశలు శ్రమించిన హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీల వరకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.  

మాకు నిరంతరం మార్గదర్శనం చేసిన డీజీపీ గారికి, ఇతర ఉన్నతాధికారులకు, ప్రతి క్షణం వెన్నంటి నిలిచిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాత్రింబవళ్లు చెమటోడ్చే నా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ క్షేమంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. హైదరాబాద్ ప్రజలందరూ సదా సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో.. హైదరాబాద్ సీపీగా ఇక సెలవు తీసుకుంటున్నాను" అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

VC SajjanarHyderabad Police CommissionerTelangana IPS TransfersHyderabad CP Farewell MessageTelangana Police

More Telugu News

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో వ్యాజ్యం

13 Nov, 11:30

రోడ్ల ఆధునికీకరణపై మేధోమథనం.. హైటెక్స్‌ వేదికగా ఇండియన్ రోడ్ కాంగ్రెస్: కోమటిరెడ్డి

13 Nov, 11:28

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధర్నా

13 Nov, 10:54

భవనం మధ్యలోంచి దూసుకెళ్లనున్న మెట్రో రైలు.. చెన్నైలో వినూత్న ప్రాజెక్ట్

13 Nov, 10:50

రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రక్రియ

13 Nov, 10:47

నెల్లూరు, వైజాగ్, తిరుపతిలో కొత్త స్టార్ హోటళ్లు: మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

13 Nov, 10:45

హైదరాబాద్‌లో 4 పీఆర్‌టీఎస్ కారిడార్లు.. ఏడాదిలోనే తొలిదశ పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

13 Nov, 10:24

ఖవాజాను బలిపశువును చేశాడు.. కమిన్స్‌పై వార్నర్ ఫైర్!

13 Nov, 10:21

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అరుదైన గౌరవం

13 Nov, 10:18

'నేనొక పనికిమాలిన వాడిని'.. రాజీనామా స‌మ‌యంలో కుంగిపోయిన జెన్సన్ హువాంగ్!

13 Nov, 10:01

రెండేళ్లలో భారత్‌లోనే సొంతంగా విమానాల తయారీ: రామ్మోహన్‌ నాయుడు

13 Nov, 09:46

చేతిలోని నగదు బ్యాగ్‌ లాక్కెళ్లిన కోతి.. చెట్టుపై నుంచి డబ్బుల వర్షం.. ఇదిగో వీడియో!

13 Nov, 09:29

'బర్త్ టూరిజం'పై అమెరికా ఉక్కుపాదం.. 6 వేల‌కు పైగా వీసాల రద్దు

13 Nov, 09:09

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లి గోడను ఢీకొన్న కారు

13 Nov, 08:55
..More Telugu News