Advertisement

నెల్లూరు, వైజాగ్, తిరుపతిలో కొత్త స్టార్ హోటళ్లు: మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

Andhra
Advertisement
  • పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్‌ ఇంజన్‌గా మారుస్తున్నామన్న కందుల దుర్గేశ్
  • రూ.442.92 కోట్ల పెట్టుబడులతో మూడు స్టార్ హోటళ్లు రాబోతున్నాయని వెల్లడి
  • టూరిజం రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రధాన ‘గ్రోత్ ఇంజన్’గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో మొత్తం రూ.442.92 కోట్ల భారీ పెట్టుబడులతో మూడు నూతన స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తూ, నెల్లూరులో డీఎస్ఆర్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ సంస్థ రూ.139.92 కోట్ల వ్యయంతో 123 గదుల అత్యాధునిక హోటల్‌ను నిర్మించనుందని మంత్రి తెలిపారు. అలాగే, పర్యాటక రాజధాని విశాఖపట్నంలో రూ.115 కోట్ల పెట్టుబడితో 98 గదుల సామర్థ్యంతో ‘ది పార్క్ హోటల్స్’ ప్రాజెక్ట్ రానుందని చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద రూ.188 కోట్లతో గ్రాండ్‌ తిరుపతి హోటల్స్‌ అండ్ రిసార్ట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ నూతన స్టార్ హోటల్‌ను నెలకొల్పనున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా విస్తరించేందుకు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక నగరాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యాల ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలు బలోపేతం కావడమే కాకుండా, స్థానికంగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Kandula DurgeshAndhra Pradesh TourismNew Star Hotels in APAP Hospitality InvestmentsVisakhapatnam Star HotelsTirupati Hotel Projects

More Telugu News

రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రక్రియ

13 Nov, 10:47

హైదరాబాద్‌లో 4 పీఆర్‌టీఎస్ కారిడార్లు.. ఏడాదిలోనే తొలిదశ పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

13 Nov, 10:24

ఖవాజాను బలిపశువును చేశాడు.. కమిన్స్‌పై వార్నర్ ఫైర్!

13 Nov, 10:21

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అరుదైన గౌరవం

13 Nov, 10:18

'నేనొక పనికిమాలిన వాడిని'.. రాజీనామా స‌మ‌యంలో కుంగిపోయిన జెన్సన్ హువాంగ్!

13 Nov, 10:01

రెండేళ్లలో భారత్‌లోనే సొంతంగా విమానాల తయారీ: రామ్మోహన్‌ నాయుడు

13 Nov, 09:46

చేతిలోని నగదు బ్యాగ్‌ లాక్కెళ్లిన కోతి.. చెట్టుపై నుంచి డబ్బుల వర్షం.. ఇదిగో వీడియో!

13 Nov, 09:29

'బర్త్ టూరిజం'పై అమెరికా ఉక్కుపాదం.. 6 వేల‌కు పైగా వీసాల రద్దు

13 Nov, 09:09

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లి గోడను ఢీకొన్న కారు

13 Nov, 08:55

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన మైక్రోసాఫ్ట్ సేవలు.. లక్షలాది మంది యూజర్లకు చుక్కలు!

13 Nov, 08:47

తెలంగాణలో గిగ్ వర్కర్ల భారీ ర్యాలీ.. హాజరుకానున్న రాహుల్ గాంధీ!

13 Nov, 08:35

ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల ఎంఓయూ

13 Nov, 08:18

ఏపీ పంచాయతీ పోరు.. ఏకగ్రీవాలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం

13 Nov, 08:07

డెన్నీస్ రెస్టారెంట్ నుంచి 4.5 ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. జెన్సన్ హువాంగ్ పతనానికి కారణమేంటి?

13 Nov, 07:44
..More Telugu News