Advertisement

ఏపీలో పెండింగ్‌లో ఉన్న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

Andhra
Advertisement
  • ఏపీలో 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్
  • నవంబర్ 26న పోలింగ్.. 30న ఫలితాలు
  • అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్‌లో ఉన్న కొన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నగారా మోగించింది. రాష్ట్రంలోని 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈరోజు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ వెలువడటంతో సంబంధిత పురపాలక ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) తక్షణమే అమల్లోకి వచ్చింది.

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... నవంబర్ 14 నుంచి 16 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థుల ఉపసంహరణకు నవంబర్ 19 వరకు గడువు ఇచ్చారు. అనంతరం నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

గతంలో న్యాయపరమైన వివాదాలు, వార్డుల పునర్విభజన కారణాలతో ఈ 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టులో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడం, రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి రావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.

ఈ ఎన్నికల ద్వారా శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలోని 260 డివిజన్లతో పాటు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని 749 వార్డులకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

AP municipal election scheduleAP State Election CommissionAndhra Pradesh municipal electionsAnil Chandra PunethaAP corporation electionsAP local body polls

More Telugu News

'పుష్పక విమానం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

12 Nov, 14:51

అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుమార్తెకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు

12 Nov, 14:38

అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’ విడుదల తేదీ ఖరారు.. సత్యతో కలిసి కామెడీ పంచేందుకు రెడీ

12 Nov, 14:35

ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో 'జార్విస్'.. ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే స్మార్ట్ రూమ్.. భారతీయ కుర్రాడి అద్భుత సృష్టి!

12 Nov, 14:12

యూఎస్ వీసా రూల్స్ మార్పు ప్రతిపాదన.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మిషిగన్ యూనివర్సిటీ

12 Nov, 13:58

శ్రీకాళహస్తి ఆలయంలోని అన్నప్రసాద పోటులో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు

12 Nov, 13:46

కేరళంలో కలకలం రేపుతున్న షిగెల్లా బ్యాక్టీరియా.. మలప్పురంలో హై అలర్ట్

12 Nov, 13:44

అభివృద్ధిలో మోదీ-బాబుది 'ఆర్ఆర్ఆర్' జోడీ.. సీఎం చంద్రబాబుపై గోయెల్ ప్రశంసల వర్షం

12 Nov, 13:39

సీఐఐ సదస్సులో ఏపీపై పారిశ్రామికవేత్తల ప్రశంసల జల్లు.. కియా రూ. 18 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన

12 Nov, 13:27

21 సిక్సర్లతో విరుచుకుపడ్డ కివీస్ బ్యాటర్.. లిస్ట్-ఏ క్రికెట్‌లో రికార్డు ఇన్నింగ్స్

12 Nov, 13:23

అరకు కాఫీ రుచి చూసిన పీయూష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఐఐ సదస్సు ఫొటోలు ఇవిగో!

12 Nov, 13:16

యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 500 ఎంబీపీఎస్‌ వరకు ఉచిత అప్‌గ్రేడ్

12 Nov, 13:13

స్థానిక ఎన్నికల్లో ఓటములపై లోకేశ్‌ సమీక్ష.. 4 అంశాలపై నివేదికలకు ఆదేశం!

12 Nov, 13:13

ఏపీని మీ కార్పోరేట్ హోంగా మార్చుకోండి.. పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ఉంటాం: మంత్రి లోకేశ్‌

12 Nov, 13:01
..More Telugu News