Advertisement

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. అంతా సురక్షితం

Entertainment
Advertisement
  • ముచ్చింతల్ వద్ద ఈ తెల్లవారుజామున శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం
  • చిరంజీవి సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా ఘటన
  • నాలుగు రోడ్ల కూడలి వద్ద శేఖర్ మాస్టర్ వాహనాన్ని ఢీకొట్టిన మరో వాహనం
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదం నుంచి శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'కాక' షూటింగ్ జరుగుతోంది. అక్కడ చిత్రీకరణ ముగించుకుని శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో నగరానికి బయలుదేరారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు చేరుకోగానే, ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు కొంతమేర దెబ్బతిన్నప్పటికీ, వాహనంలో ఉన్నవారంతా ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Sekhar MasterSekhar Master car accidentTollywood choreographer Sekhar MasterSekhar Master accident Muchintal

More Telugu News

డోలు వాయించిన చంద్రబాబు, పీయూష్ గోయల్, పవన్ కల్యాణ్.. సీఐఐ సమ్మిట్ ఫొటోలు ఇవిగో

12 Nov, 12:29

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను నియమించుకోవడం గౌరవంగా భావిస్తా: ఎలాన్‌ మస్క్‌

12 Nov, 12:27

నవ్విస్తూనే ఆలోచింపజేసేలా.. ‘ఇడుపు కాయితం’ టీజర్ చూశారా?

12 Nov, 12:25

సంజయ్‌ మరణం.. రాజీవ్‌ ప్రధాని కావడం.. సోనియాకు ముందే చెప్పింది ఎవరు?

12 Nov, 12:23

'సైనికుడి సమాధి వద్ద నవ్వులా?.. మౌనం పాటించండి'.. అమెరికా ర‌క్ష‌ణ మంత్రినే మంద‌లించిన గార్డ్‌ వీడియో వైర‌ల్‌!

12 Nov, 12:19

కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన గోరఖ్‌పూర్ రైలు.. 300 మంది ప్రయాణికులు సురక్షితం

12 Nov, 11:41

ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ఇద్దరి బెయిల్ రద్దుకు ఈడీ పిటిషన్

12 Nov, 11:39

బ్యాంకు ఖాతా లేకున్నా డబ్బు పంపొచ్చు.. ఆర్బీఐ కొత్త నిబంధనలివే!

12 Nov, 11:38

రాప్తాడు ఉన్మాదికి పల్మనరీ ఎంబాలిజం

12 Nov, 11:36

దిగొచ్చిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే!

12 Nov, 11:35

‘కహో నా ప్యార్ హై’ ఎడిటింగ్‌లో ఏం జరిగిందంటే..: హృతిక్ రోషన్

12 Nov, 11:32

జనసేన కార్యాలయం, నేతల పేరుతో భారీ మోసం.. రూ. 7 కోట్లు వసూలు

12 Nov, 11:25

టాటా గ్రూప్‌లో ముగిసిన నోయెల్ టాటా శకం.. పలు కంపెనీల నుంచి పదవీ విరమణ

12 Nov, 11:16

స్వీట్‌ కనిపిస్తే ఆగలేకపోతున్నారా? అతిగా తినకుండా ఉండేందుకు 3 సింపుల్‌ చిట్కాలు!

12 Nov, 11:04
..More Telugu News