Advertisement

నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న పెట్టుబడుల పండుగకు సిద్ధమైన విశాఖ

Andhra
Advertisement
  • విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • కేంద్ర మంత్రి, పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రారంభించనున్న‌ సీఎం చంద్రబాబు
  • వివిధ కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు
  • ప్లాంట్ విస్తరణపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనున్న కియా సంస్థ
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో విశాఖ నగరం రెండు రోజుల పెట్టుబడుల పండుగకు సిద్ధమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 ఈ రోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్‌తో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మొద‌ట‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎంఎస్‌ఎంఈ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్లీనరీ హాల్‌లో జరిగిన సదస్సులో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, పెట్టుబడులకు ఉన్న అనువైన అవకాశాలను ఆయన వివరిస్తారు. మధ్యాహ్నం 1.40 గంటలకు నోవోటెల్ హోటల్‌లో జరిగే మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును కూడా సీఎం ప్రారంభించనున్నారు.

సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలు, చైర్మన్లు, విదేశీ రాయబారులతో వరుసగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా కియా కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎయి చుల్ జెంగ్, సీఈఓ గ్వాన్గు లీలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో తమ ప్లాంట్‌ను విస్తరించేందుకు కియా సంస్థ ప్రభుత్వంతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ రెండు రోజుల పాటు విశాఖ నగరం దేశ, విదేశీ పెట్టుబడుల చర్చలకు కేంద్రంగా నిలవనుంది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Chandrababu NaiduVisakhapatnam Investment SummitCII Partnership Summit 2026Andhra Pradesh InvestmentsKia Motors ExpansionPiyush Goyal

More Telugu News

రూ.70 లక్షల జీతం.. అయినా ఉద్యోగం ఊస్ట్.. క్వాల్‌కామ్‌లో కలకలం

12 Nov, 10:28

యూకే, ఐర్లాండ్‌లో ‘రామాయణ’ చరిత్ర.. హాలీవుడ్‌, జపాన్‌ సినిమాలను వెనక్కి నెట్టి అగ్రస్థానం

12 Nov, 10:25

నాని సినిమా టీంపై బాబు మోహన్ ఫైర్.. కర్మ ఫలం అంటూ సంచలన వ్యాఖ్యలు!

12 Nov, 10:24

వెయ్యి కోట్ల విలువైన బీసీ స్టడీ సర్కిల్ భూములను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు: దాసోజు శ్రవణ్

12 Nov, 10:21

ఓవర్‌టేక్ చేశాడని యువకుడి వేళ్లు నరికిన మైనర్లు.. 700 కుట్లు వేసిన వైద్యులు

12 Nov, 10:14

రూ.100తో మొదలైన ప్రయోగం.. నేడు రూ.కోటి వ్యాపారం.. ఒడిశా రైతు సక్సెస్‌ స్టోరీ

12 Nov, 10:12

పంజాబ్‌లో ఆగని పొలాల దహనం.. 5,500 దాటిన పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలు

12 Nov, 10:08

సోనియా గాంధీ జీవితంపై సినిమా.. నిర్మాతలుగా కాంగ్రెస్ కార్యకర్తలు: జగ్గారెడ్డి సంచలన ప్రకటన

12 Nov, 10:06

పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. గుంటూరు జిల్లా వాసి అరెస్ట్

12 Nov, 10:04

భారత్‌తో వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌ జట్టులోకి కొత్త పేసర్‌

12 Nov, 10:01

ఆస్ట్రేలియా అడవిలో అద్భుతం.. ఆరు రోజుల తర్వాత ప్రాణాలతో దొరికిన టీనేజర్

12 Nov, 09:59

సునీతా విలియమ్స్‌కు అరుదైన గౌరవం.. న్యూయార్క్ పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా సన్మానం

12 Nov, 09:45

ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు? బీసీసీఐ కీలక ప్రకటన!

12 Nov, 09:43

సొంత వ్యాపారం మొదలుపెట్టే ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులు.. 'ఐడీ ఫ్రెష్' సీఈవో బంపరాఫర్!

12 Nov, 09:40
..More Telugu News