భారత పౌరసత్వం కోసం సోనియా 15 ఏళ్లు ఎందుకు ఆగారు?.. కంగనా రనౌత్ ప్రశ్న
Advertisement
- 1968లో రాజీవ్ గాంధీతో సోనియా వివాహం
- 1983లో సోనియా భారత పౌరసత్వం స్వీకరణ
- సంజయ్ మరణం తర్వాత పౌరసత్వం తీసుకోవడంపై కంగన ప్రశ్నలు
- గాంధీ కుటుంబంలో వరుస మరణాలపై కంగనా సంచలన ఆరోపణలు
- మేనకా గాంధీని ఇంటి నుంచి పంపించారని ఆరోపణ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ భారత పౌరసత్వం స్వీకరించిన అంశంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ప్రశ్నలు సంధించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1968లో వివాహం చేసుకున్న సోనియా.. భారత పౌరసత్వం పొందేందుకు 1983 వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సోనియా ఇటీవల విడుదల చేసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ అనే జ్ఞాపకాల పుస్తకంతో ముడిపెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా పోస్టు పెట్టారు.
సంజయ్ గాంధీ 1980లో మరణించిన తర్వాత మూడేళ్లకు సోనియా పౌరసత్వం తీసుకున్నారని కంగనా పేర్కొన్నారు. రాజీవ్‌తో వివాహం జరిగినప్పటి నుంచి 15 ఏళ్ల పాటు భారత పౌరసత్వం తీసుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. సంజయ్ మరణం తర్వాతే పౌరసత్వం తీసుకోవడం వెనుక కారణాలేంటని సందేహం వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై నవంబర్ 10న కూడా కంగనా వరుస పోస్టులు పెట్టారు. తన ‘ఎమర్జెన్సీ’ సినిమా కోసం గాంధీ కుటుంబ రాజకీయ చరిత్రపై విస్తృతంగా పరిశోధన చేసినట్లు చెప్పారు. ఆ కుటుంబంలోకి సోనియా వచ్చిన తర్వాత ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వరుసగా మరణించారని, చివరకు సోనియా మాత్రమే రాజకీయంగా మిగిలారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల్లో ఎన్నో యాదృచ్ఛికాలు ఉన్నాయని తనకు అనిపించిందన్నారు. సోనియాపై విదేశీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించారంటూ కూడా ఆరోపణలు చేశారు.
మరో పోస్టులో సంజయ్ గాంధీ మరణం తర్వాత ఆయన భార్య మేనకా గాంధీని కుమారుడితో పాటు ఇంటి నుంచి బయటకు పంపించారని కంగనా ఆరోపించారు. సోనియా చెప్పిన కారణాలతోనే మేనకను ఇంటి నుంచి పంపించారని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
రాజీవ్ గాంధీ విదేశాల్లోని ఓ కేఫ్‌లో సోనియాను కలుసుకున్నారని, ఆ పరిచయం తర్వాత ఆమె గాంధీ కుటుంబంలో కీలక స్థానానికి చేరుకున్నారని కంగనా తన పోస్టులో ప్రస్తావించారు. ఇందిరా గాంధీ, సంజయ్, రాజీవ్ మరణాల తర్వాత సోనియా రాజకీయంగా కీలక స్థానంలో నిలిచారని వ్యాఖ్యానించారు. మేనకా గాంధీకి సంబంధించిన ఓ వీడియోలో ఆమె కనిపించిన తీరు తనను కలచివేసిందని కూడా కంగనా పేర్కొన్నారు.