జిల్లాల్లోనే పూర్తి వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి దామోదర రాజనర్సింహ
Advertisement
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష
- ప్రతి జిల్లాలో డీసీహెచ్ఎస్ కార్యాలయాల ఏర్పాటుపై విస్తృత కసరత్తు
- కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రజలు చిన్న సమస్యలకు కూడా రాజధాని హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా, జిల్లాల్లోనే కార్పొరేట్ స్థాయి పూర్తి వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో సేవల నాణ్యత, పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర స్థాయి డైరెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి వరకు స్పష్టమైన పాలనా బాధ్యతలు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మౌలిక వసతుల లోపాలు, సిబ్బంది కొరత వంటి సమస్యలను జిల్లా స్థాయిలోనే ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
వైద్య సేవల విస్తరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకాలతో పాటు అవసరమైన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నాణ్యమైన చికిత్సను చేరువ చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.