హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపల్, లెక్చరర్ అరెస్ట్!

Telangana
  • ఎస్ఆర్ నగర్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి భానుప్రసాద్ రెడ్డి ఆత్మహత్య
  • ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలతో ప్రిన్సిపల్, లెక్చరర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఫోన్ ఇవ్వకుండా వేధించారని విద్యార్థి బలవన్మరణం
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పరిధిలో చోటుచేసుకున్న హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలపై బల్కంపేటలోని అమృత హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్ భాస్కర్‌లను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన కట్టా భాను ప్రసాద్ రెడ్డి (20) నగరంలో హోటల్ మేనేజ్‌మెంట్ సెకండియర్ చదువుతూనే, ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఓ మహిళా లెక్చరర్ ఫొటోను ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి తోటి విద్యార్థికి పంపడంతో వివాదం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న లెక్చరర్ విద్యార్థి మొబైల్ ఫోన్‌ను లాక్కుని ప్రిన్సిపల్‌కు అప్పగించారు.

తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ భానుప్రసాద్ క్షమాపణ కోరాడు. అతని సోదరుడు ప్రవీణ్ రెడ్డి కూడా కళాశాలకు వచ్చి క్షమించాలని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ ఫోన్ తిరిగి ఇవ్వకుండా వారం రోజులుగా వేధించారని తోటి విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డెలివరీ పనికి ఫోన్ అత్యవసరం కావడం, కాలేజీలో అవమానం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భానుప్రసాద్ శుక్రవారం రాత్రి తన గదిలో ఉరివేసుకుని తనువు చాలించాడు.

తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పినా ఫోన్ ఇవ్వకుండా వేధించడమే ఈ దారుణానికి కారణమని తోటి విద్యార్థులు ఆరోపించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపల్, మరో లెక్చరర్‌ భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Hyderabad student suicideSR Nagar police

More Telugu News

అనంతపురంలో ఓడిపోయే అవకాశమే లేదు.. కానీ ఓటమి ఎదురైంది: సీఎం చంద్రబాబు

09 Nov, 18:08

జిల్లాల్లోనే పూర్తి వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి దామోదర రాజనర్సింహ

09 Nov, 17:53

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్పు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

09 Nov, 17:47

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

09 Nov, 17:40

బయటకు వెళ్లి ఇంటికి రాగానే.. ఈ 5 వస్తువులను శుభ్రం చేస్తున్నారా?

09 Nov, 17:37

ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగాయనడం విడ్డూరం: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

09 Nov, 16:48

పదేళ్లలోనే పెను మార్పు.. భారత్‌పై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

09 Nov, 16:45

స్టాక్‌ మార్కెట్‌కు బ్యాంకుల బూస్ట్‌.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

09 Nov, 16:32

టెస్ట్ క్రికెట్‌లో ముష్ఫికర్ రహీం చరిత్ర.. తొలి బంగ్లా ఆటగాడిగా అరుదైన ఘ‌న‌త

09 Nov, 16:27

ఎన్విడియా సీఈఓతో గూఢచారి ఎఫైర్‌ కలకలం.. చైనా కీలక ప్రకటన!

09 Nov, 16:22

పట్నం నరేందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు: కేటీఆర్

09 Nov, 16:15

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్.. జనవరిలో ప్రకటనకు ఈసీ కసరత్తు!

09 Nov, 16:04

చదివితే ఉద్యోగం ఖాయమనే రోజులు పోయాయా? చైనా ఉదాహరణతో భారత యువతకు వెంబు హెచ్చరిక

09 Nov, 15:59

కాలుష్యం నుంచి ఆహారం రక్షిస్తుందా? ఈ పోషకాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

09 Nov, 15:55
..More Telugu News