యూత్ ను ఆకట్టుకునే 'నూరుకోడి వానవిల్'

Entertainment
Advertisement
  • తమిళంలో రూపొందిన లవ్ స్టోరీ
  • హరీశ్ కల్యాణ్ జోడీగా సిద్ధి ఇద్నాని
  • జీ 5లో జరుగుతున్న స్ట్రీమింగ్
  • తమిళంతో పాటు హిందీ .. తెలుగులో అందుబాటులోకి
కోలీవుడ్ హీరోలలో హరీష్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు అందుకు కారణమని చెప్పాలి. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఒక సినిమా ఇప్పుడు 'జీ 5'లో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆ సినిమా పేరే 'నూరుకోడి వానవిల్'. రొమాంటిక్ డ్రామా జోనర్ కి సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేరుగా 'జీ 5'లోనే విడుదల చేయబడింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. 

కథలోకి వెళితే .. వినోద్ ముంబైలోని ఒక టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని ప్రోగ్రామ్స్ మంచి టీఆర్పీతో రన్ అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలోనే అతనిని ఒక కొత్త ప్రోగ్రామ్ నిమిత్తం 'గోవా' పంపిస్తారు. తాను డిజైన్ చేసిన కాన్సెప్ట్ తోనే అతను గోవా చేరుకుంటాడు. సిటీలోకి అడుగుపెడుతూ ఉండగానే ఒక అమ్మాయి అతనికి తారసపడుతుంది. ఆ అమ్మాయి పేరే 'ఫెన్నీ'. ఆమె గ్లామర్ .. చురుకుదనం అతనిని కట్టిపడేస్తాయి. దాంతో ఆమెను తన ప్రోగ్రామ్ కి యాంకర్ పెట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. 

ఫెన్నీ వెంటపడుతూ .. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు వినోద్. అయితే యాంకర్ గా చేయడానికి ఆమె 'నో' చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారకుడు ఆమె బాయ్ ఫ్రెండ్ అనీ, ప్రస్తుతం అతను హాస్పిటల్లో కోమాలో ఉన్నాడని అతనికి తెలుస్తుంది. అతను కోమాలో నుంచి బయటపడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమనే సంగతి అతనికి అర్థమవుతుంది. అప్పుడు వినోద్ ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథ యూత్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Harish KalyanNooru Kodi VaanavilZee5 OTT releaseDirector SasiRomantic drama movieTamil cinema

More Telugu News

పార్లమెంట్ ప్రోరోగ్‌లో రికార్డు జాప్యం.. ప్రత్యేక భేటీ కోసమేనా?

09 Nov, 10:19

ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తారా? ట్రంప్‌ సమాధానం ఇదే..

09 Nov, 10:17

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. ఢిల్లీతో పోటీపడుతున్న భాగ్యనగరం!

09 Nov, 10:14

దీపావళి విషాదం.. టపాసుల దెబ్బకు హైదరాబాద్‌లో శాశ్వతంగా చూపు కోల్పోయిన వ్యక్తి

09 Nov, 10:11

ఏడాది పాటు భారత్‌లో.. చివరిరోజు విదేశీయుడి భావోద్వేగ సందేశం

09 Nov, 10:07

దీపావళి రోజున కుమ్మేసిన 'రామాయణ'

09 Nov, 10:07

భర్త తప్పుతో వార్తల్లోకి లోరీ మిల్స్.. వారి ప్రేమకథ మీకు తెలుసా?

09 Nov, 09:57

చైనాలో తీవ్రమవుతున్న రుణ సంక్షోభం.. అప్పుల ఊబిలో 10 కోట్ల మంది!

09 Nov, 09:42

చదరంగంలో భారత్ చారిత్రక శతకం.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవత్రి

09 Nov, 09:39

అక్కడే 'సీన్' మారిపోయింది .. లేదంటే హిట్ పడేదే!

09 Nov, 09:35

చంద్రకోర తిలకం ధరించి కూతురితో కలిసి రేణూ దేశాయ్ దీపావళి

09 Nov, 09:31

న్యూజిలాండ్‌కు మరో షాక్‌.. చివరి రెండు వన్డేలకు ఇద్దరు కీలక బౌలర్ల దూరం

09 Nov, 09:27

విదేశీ గూఢచారితో సంబంధాల ఆరోపణలు.. అయినా హువాంగ్‌కు ట్రంప్‌ అండ!

09 Nov, 09:25

ఇంగ్లీషులో ఇరగదీస్తున్న ఆటో డ్రైవర్.. ఆటోవాలా స్పీచ్‌కి నెటిజన్ల ఫిదా.. వైరల్ వీడియో!

09 Nov, 09:18
..More Telugu News