మురసు తుఫాన్‌ నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రేపటిలోగా నిత్యావసరాల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం!

Andhra
Advertisement
  • ఈ నెల 9లోగా పంట నష్టం అంచనాలు పూర్తి
  • ఉద్యాన పంటల నష్టం అంచనాలు 92 శాతం పూర్తి
  • తుపాను ప్రభావిత 1,825 గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు
  • ఇప్పటివరకు 3.82 లక్షల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
  • రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయం
  • రేషన్‌ దుకాణాల్లో తక్కువ ధరలకు పామాయిల్‌, కందిపప్పు, గోధుమ పిండి
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, విద్యుత్‌ పునరుద్ధరణ, పంట నష్టం అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్‌, రెవెన్యూ, విద్యుత్‌, వ్యవసాయ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తుపాను బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ, తక్షణ ఆర్థిక సాయం అందించే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి 92 శాతం నష్టం అంచనాలు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయ పంటల నష్టాల అంచనా ఈ నెల 9వ తేదీ నాటికి పూర్తవుతుందని తెలిపారు. గతంలో వచ్చిన అర్నబ్‌ తుపాను కారణంగా సుమారు 30 వేల విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయని, అన్ని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మురసు తుపాను ప్రభావిత 1,825 గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపట్టగా.. ఇప్పటివరకు 7,850 దెబ్బతిన్న స్తంభాలను బాగు చేసినట్లు తెలిపారు.

తుపాను బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 3.82 లక్షల కుటుంబాలకు సరకులు అందించినట్లు వెల్లడించారు. ఆదివారం నాటికి పంపిణీని పూర్తిచేస్తామని సీఎంకు తెలిపారు.

మరోవైపు బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపైనా చంద్రబాబు ఆరా తీశారు. ఉల్లిపాయలు, బియ్యం, పామాయిల్‌, గోధుమ పిండి, కందిపప్పు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రైతుబజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందుకోసం 8 వేల క్వింటాళ్ల ఉల్లిపాయలను మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

బియ్యం ధరల నియంత్రణకు మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులతో చర్చలు జరిపినట్లు అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో బీపీటీ సోనా, సాంబ, కేఎన్‌ఎం రకాల బియ్యాన్ని కిలో రూ.66కు, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలను రూ.76కు, జై శ్రీరామ్‌ రకాన్ని రూ.82కు, సాధారణ రకం బియ్యాన్ని రూ.47కు విక్రయించేందుకు వ్యాపారులు అంగీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన 204 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ధరణి బ్రాండ్‌ బియ్యాన్ని రైతుబజార్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.70 పలుకుతున్న బియ్యాన్ని రైతుబజార్లలో రూ.50కే విక్రయిస్తున్నామని చెప్పారు. బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.49కు అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 150 కౌంటర్ల ద్వారా 27,430 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించగా.. 1.03 లక్షల కుటుంబాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రేషన్‌ దుకాణాల ద్వారా లీటరు పామాయిల్‌ రూ.125కు, కిలో కందిపప్పు రూ.100కు, గోధుమ పిండి రూ.25కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduCyclone Murasu ReliefAndhra Pradesh Crop DamageEssential Supplies DistributionPrice Control MeasuresPower Restoration Works

More Telugu News

ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్‌.. పంజాబ్‌కు హార్దిక్‌, ముంబయికి అర్ష్‌దీప్‌!

07 Nov, 21:36

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు.. ట్రంప్‌ కీలక ప్రకటన!

07 Nov, 21:17

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌.. గుజరాత్‌ వ్యాపారి ఔదార్యానికి ఉద్యోగులు ఎమోషనల్‌!

07 Nov, 21:03

దశాబ్దాల కంచుకోట బద్దలు.. కోటవురట్లలో కూటమి చారిత్రక విజయం

07 Nov, 20:41

‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌’ పాట విడుదల.. స్టైలిష్‌ లుక్‌లో నాగచైతన్య

07 Nov, 20:25

వయసు పెరిగినా వేలిముద్రలు మారవా? ఆసక్తికరమైన శాస్త్రీయ రహస్యాలు!

07 Nov, 20:11

చీకటిపై వెలుగుల విజయం.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దీపావళి శుభాకాంక్షలు!

07 Nov, 19:54

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. వడ్డీరేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

07 Nov, 19:44

బొత్స కుటుంబానికి షాక్‌.. జడ్పీటీసీ బరిలో కుమార్తె అనూష పరాజయం

07 Nov, 19:15

చైనా క్షిపణులకు చెక్‌ పెట్టేందుకు అమెరికా మాస్టర్‌ప్లాన్‌.. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్‌బేస్‌లకు మళ్లీ కళ!

07 Nov, 19:01

మెట్రో సిటీలో రూ.5 లక్షల జీతం.. సొంతూరిలో రూ.3 లక్షలు.. చివరకు మిగిలేది ఎంత?

07 Nov, 18:45

కానిస్టేబుల్‌ కిరాతకం.. భార్యను చంపి.. గోదావరిలో పడేసి..

07 Nov, 18:23

ప్రాజెక్టుల్లో నీళ్లన్నీ తాగేందుకే.. రైతులకు సీఎం రేవంత్‌ కీలక హెచ్చరిక!

07 Nov, 18:10

అరుణాచల్‌ను చైనా ఆక్రమించిందా? వైరల్‌ ప్రచారంపై సైన్యం కీలక ప్రకటన!

07 Nov, 18:00
..More Telugu News