తమిళనాడు సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్
Advertisement
- ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న 'మురసు' తుఫాను
- విద్యుత్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా
- పునరుద్ధరణకు తమిళనాడు సాయం కోరిన చంద్రబాబు
- సిబ్బందిని, యంత్రాలను పంపుతామని హామీ ఇచ్చిన తమిళనాడు సీఎం
- ఇప్పటికే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ విద్యుత్ సిబ్బంది
- కర్ణాటక సహకారం కూడా తీసుకోవాలని యోచిస్తున్న ఏపీ ప్రభుత్వం
Advertisement
ఆంధ్రప్రదేశ్‌పై 'మురసు' తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల సహకారం కోరుతూ ఆయన ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఫోన్ చేశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, పునరుద్ధరణ పనుల కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే తుపాను వల్ల పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని చంద్రబాబు తమిళనాడు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వేగంగా పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బందిని, యంత్ర సామగ్రిని ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని కోరారు. చంద్రబాబు విజ్ఞప్తికి తమిళనాడు సీఎం విజయ్ వెంటనే సానుకూలంగా స్పందించారు. ఏపీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, తక్షణమే సిబ్బందిని, యంత్రాలను పంపుతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, ఇటీవల సంభవించిన 'ఆర్నబ్' తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించే పనుల్లో తెలంగాణ విద్యుత్ సిబ్బంది ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఈ పనులు కొనసాగుతుండగానే మరో తుపాను హెచ్చరికలు రావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అవసరాన్ని బట్టి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.