ఈసారి మాపై దాడి చేస్తే, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిదాడి చేస్తాం: మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక
Advertisement
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందన
- భౌగోళిక పరిమితులు లేకుండా బదులిస్తామన్న సుప్రీం లీడర్ ఖొమైనీ
- సర్వసన్నద్ధంగా ఉండాలని సైనిక దళాలకు ఆదేశాలు
- ఒకవైపు దౌత్య చర్చలు, మరోవైపు యుద్ధ హెచ్చరికలతో ఉద్రిక్తత
- ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయగలమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Advertisement
అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంపై అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ దాడికి పాల్పడితే, ఎలాంటి భౌగోళిక పరిమితులు లేకుండా తక్షణమే, శక్తిమంతంగా బదులిస్తామని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ దేశ సాయుధ దళాలను ఆదేశించారు.
ప్రస్తుత వివాదం మొదలైన తర్వాత తొలిసారిగా దేశంలోని ముగ్గురు ఉన్నత సైనిక కమాండర్లతో మొజ్తబా ఖమేనీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. "శత్రువులు మళ్లీ సైనిక లేదా ఉగ్రవాద దాడులకు దిగితే, ఆ ఘర్షణలు ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ముగుస్తాయో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సైన్యం, ఇరాన్ ప్రజలే నిర్ణయిస్తారు" అని మొజ్తబా స్పష్టం చేసినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. "శత్రు దేశాల భౌతిక, అభౌతిక ఆస్తులన్నింటినీ లక్ష్యం చేసుకునేలా టార్గెట్ డేటాబేస్‌ను నవీకరించాలని సూచించారు.
ఈ సమావేశంలో సైనిక కమాండర్లు కూడా తమ సంసిద్ధతను ఖమేనీకి వివరించారు. పర్షియన్ గల్ఫ్ తీరం, హర్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ సహా దేశ సరిహద్దుల వద్ద గరిష్ఠ స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఆయుధాలు, నిఘా పరికరాలు, మందుగుండు సామగ్రి ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు నివేదించారు. సైనిక నిఘాను బలోపేతం చేయడం, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను విస్తరించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్ ఉన్నత భద్రతా అధికారి మొహసెన్ రెజాయ్ మాట్లాడుతూ.. తమపై దాడి జరిగితే విధ్వంసకరంగా దెబ్బతీస్తామని, కొత్త ఆయుధాలను ఉపయోగిస్తామని హెచ్చరించారు. అయితే, అమెరికా తమ ఏడు షరతులకు అంగీకరిస్తే దౌత్యానికి ఇంకా అవకాశం ఉందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేత, అమెరికా సైనిక ఉనికిని తగ్గించడం, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, చమురు మినహాయింపుల పునరుద్ధరణ వంటివి ఈ షరతులలో ఉన్నాయి.
ఈ హెచ్చరికల నేపథ్యంలోనే తెరవెనుక దౌత్యపరమైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అయితే చర్చలు బాగానే సాగుతున్నప్పటికీ, ఇరాన్ "అంత నమ్మదగినది కాదు" అని, అవసరమైతే వారి అణు కేంద్రాలపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.