హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన పసిడి ధరల్లో నేడు ఎటువంటి మార్పు నమోదు కాలేదు. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో ధరల కదలికలు మందగించడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నేటి ఉదయం గణంకాల ప్రకారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి: 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,42,760 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,860గాను, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,07,070గాను నమోదయ్యాయి.

పసిడి బాటలోనే వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,19,900 వద్ద కొనసాగుతోంది.

కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలలోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,42,910 వద్ద కొనసాగుతూ, ఇక్కడి కంటే స్వల్పంగా అధికంగా ఉంది.