- రద్దు అయిన టికెట్లపై చెల్లించిన జీఎస్‌టీ రిఫండ్‌కు ట్రైబ్యునల్ ఆమోదం
- సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు రూ. 45.92 లక్షలు వడ్డీతో చెల్లించాలని ఆదేశం
- ప్రయాణికులకు ముందే పూర్తి డబ్బులు వాపస్ చేశామన్న విమానయాన సంస్థ
విమాన ప్రయాణాలు రద్దయితే జీఎస్‌టీ రిఫండ్ పొందే అంశంపై జీఎస్‌టీ అపిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్‌టాట్) ఎర్నాకుళం బెంచ్ ఒక కీలక తీర్పును వెలువరించింది. కొవిడ్-19 సమయంలో రద్దయిన విమాన టికెట్లపై చెల్లించిన పన్నును ఎయిర్‌లైన్ కంపెనీలు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు అనుకూలంగా అక్టోబర్ 16న ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది.
కొవిడ్ నిబంధనల కారణంగా అక్టోబర్ 2019 నుంచి మార్చి 2021 మధ్య కాలంలో పలు సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఆయా టికెట్లకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ ఛార్జీలతో పాటు పూర్తి జీఎస్‌టీ మొత్తాన్ని ఎయిర్‌లైన్ వెనక్కి ఇచ్చేసింది. ఆ తర్వాత తాను ప్రభుత్వానికి చెల్లించిన రూ. 45.92 లక్షల జిఎస్‌టీ నిధులను రిఫండ్ చేయాలని ఎయిర్‌లైన్ దరఖాస్తు చేసుకోగా పన్ను అధికారులు తిరస్కరించారు. అయితే, ప్రయాణికులపై భారం పడకుండా తాము తీసుకున్న చర్యలను పేర్కొంటూ స్పష్టమైన సాక్ష్యాలతో ఎయిర్‌లైన్ సంస్థ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. పరిశీలించిన జీఎస్‌టాట్.. అధికారుల నిర్ణయాన్ని తోసిపుచ్చింది. జీఎస్‌టీ మొత్తాన్ని వడ్డీ సహా రెండు వారాల్లోగా ఎయిర్‌లైన్‌కు చెల్లించాలని అధికారులను ఆదేశించింది.
ప్రయాణికులకు నేరుగా రిఫండ్ వస్తుందా?
ఈ తీర్పు ఎయిర్‌లైన్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి పన్ను తిరిగి పొందే హక్కుకు సంబంధించినది. కాబట్టి ప్రయాణికులకు దీనివల్ల కొత్తగా లేదా అదనంగా ఆటోమేటిక్‌గా ఎలాంటి రిఫండ్ రాదు. ఇందులో రెండు అంశాలున్నాయి.
ప్రయాణికుల రిఫండ్: విమానం రద్దు అయినప్పుడు ఎయిర్‌లైన్ కంపెనీ టికెట్ ధరతో పాటు జీఎస్‌టీని కూడా కలిపి ప్రయాణికుడికి ముందే రిఫండ్ చేయాలి.
ఎయిర్‌లైన్ జీఎస్‌టీ క్లెయిమ్: అలా ప్రయాణికుడికి తిరిగి ఇచ్చేసిన జీఎస్‌టీ మొత్తాన్ని ఎయిర్‌లైన్ సంస్థ ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసుకుంటుంది.
ఫ్లైట్ రద్దయితే ప్రయాణికులు ఏం చేయాలి?
మార్చి 26, 2026 నుంచి అమల్లోకి వచ్చిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త రిఫండ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం విమాన సంస్థలు రీఫండ్ మొత్తం, దాని పూర్తి బ్రేకప్‌ను ప్రయాణికులకు స్పష్టంగా వెల్లడించాలి.
పత్రాలు భద్రపరుచుకోవాలి: టికెట్, పేమెంట్ రసీదులు, క్యాన్సిలేషన్ కన్ఫర్మేషన్ లేఖలను భద్రంగా ఉంచుకోవాలి.
ఏజెంట్ బుకింగ్స్: ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ బుక్ చేసినప్పటికీ, రిఫండ్ బాధ్యత పూర్తిగా విమాన సంస్థదే.
తక్కువ రిఫండ్ వస్తే: ఎయిర్‌లైన్ ఇచ్చిన రీఫండ్ మొత్తంలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే సదరు విమాన సంస్థ లేదా బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో సంప్రదించాలి.