- ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’
- టీజర్‌లో నేతాజీని హిట్లర్‌తో ముడిపెట్టి చూపించడంపై అభ్యంతరాలు
- నేతాజీని హిట్లర్‌తో పోల్చడం సరికాదన్న ఎస్పీ ఎంపీ
- ప్రభాస్ పాత్రను నేతాజీ ప్రశంసించడంపై మనవడి విమర్శలు
- చారిత్రక వ్యక్తులకు గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా టీజర్ వివాదంలో చిక్కుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను హిట్లర్‌తో ముడిపెట్టి చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్ స్పందించారు. నేతాజీని హిట్లర్‌తో పోల్చడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రలో కీలక పాత్ర పోషించిన జాతీయ నాయకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.
నేతాజీ మనవడి తీవ్ర అభ్యంతరం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రమార్ కుమార్ బోస్ కూడా ‘ఫౌజీ’ టీజర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన చారిత్రక విషయాలను వక్రీకరించడం సరికాదన్నారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో చరిత్రను మార్చి చూపించకూడదని స్పష్టం చేశారు. నేతాజీ, హిట్లర్ మధ్య జరిగిన సమావేశాన్ని సినిమాలో తప్పుగా చూపించారని ఆరోపించారు. హిట్లర్‌తో నేతాజీ సమాన స్థాయిలో మాట్లాడారని, భారత స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు పొందడమే ఆయన లక్ష్యమని వివరించారు. కల్పిత పాత్రను గొప్పగా చూపించేందుకు నేతాజీ స్థాయిని తగ్గించినట్లు ఉండకూడదన్నారు. ఈ విషయంలో దర్శకుడు హను రాఘవపూడి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు వివాదం ఏంటంటే..
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘ఫౌజీ’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బెర్లిన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సమావేశమైన చారిత్రక ఘటనతో టీజర్ మొదలవుతుంది. ఆ సన్నివేశంలో ప్రభాస్ పోషించిన కల్పిత గూఢచారి పాత్ర గురించి నేతాజీ ప్రస్తావిస్తారు. బ్రిటిష్ పాలకులకు ఆ గూఢచారి ఎలా ఇబ్బందులు సృష్టించాడో వివరిస్తారు. అయితే, ఒక కల్పిత హీరోను గొప్పగా చూపించేందుకు నేతాజీ వంటి చారిత్రక వ్యక్తిని ఉపయోగించడం సరికాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నేతాజీ గౌరవానికి భంగం కలిగించొద్దు
టీజర్‌లో నేతాజీ పాత్ర ప్రభాస్ పాత్రను ప్రశంసిస్తూ మాట్లాడటం.. అతడి వివరాలను హిట్లర్‌కు వెల్లడించడం ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమైంది. చారిత్రక వ్యక్తులను కల్పిత కథల్లో చూపించే సమయంలో వారి స్థాయికి తగిన గౌరవం ఇవ్వాలని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. అయితే, సినిమా కథ కల్పిత అంశాలతో కూడుకున్నదని ప్రభాస్ అభిమానులు సమర్థిస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2027 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.