'బీహార్ అబ్బాయి-రష్యా అమ్మాయి ప్రేమకథ'.. ఫ్యాక్ట్ చెక్‌లో తేలిన అసలు నిజం!
- వైరల్ లవ్ స్టోరీ పోస్టుపై భారీ ట్విస్ట్.. అది ప్రేమ కాదు, ఫేక్ ప్రచారం!
- వీడియోలో ఉన్నది బ్రిటిష్ ఎన్జీవో ప్రతినిధి, స్థానిక యువకుడు మాత్రమే
- పుర్నియా జిల్లాలో మహిళా సాధికారత కార్యక్రమాలను పరిశీలించేందుకు వచ్చిన వైనం
- ఈ ఫేక్ ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థ హెచ్చరిక
సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా కోట్లాది వ్యూస్‌తో సంచలనం సృష్టించిన "బీహార్ యువకుడు-రష్యా యువతి" ప్రేమకథ పూర్తిగా కల్పితమని తేలింది. రష్యాలో పనిచేసే బీహార్ యువకుడి ప్రేమకు ముగ్ధురాలై, అతడిని పెళ్లాడేందుకు రష్యా యువతి వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిందంటూ సాగిన ప్రచారమంతా బూటకమని ప్రముఖ మీడియా సంస్థల ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడైంది.
వైరల్ కథనం ఏమిటి?
భాగల్పూర్కు చెందిన రాహుల్ అనే యువకుడు రష్యాలో పనిచేస్తున్నప్పుడు జూలీ అనే యువతితో ప్రేమలో పడ్డాడని, అతడి కోసం ఆమె బీహార్‌కు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అతడు గుడిసెలో నివసించే పేదవాడైనప్పటికీ ఆమె అతడిని ప్రేమించిందని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2026 నవంబర్ లో వీరి వివాహం జరగనుందని కూడా ప్రచారం చేశారు. గ్రామ వాతావరణంలో ఓ విదేశీ యువతి, స్థానిక యువకుడు గులాబీల గుత్తితో ఉన్న వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
అసలు వాస్తవం ఇది!
ఈ వైరల్ కథనంపై లోతుగా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. వీడియోలో ఉన్న యువకుడి పేరు రాహుల్ కాదు, నమిత్. అతను భాగల్పూర్కు చెందినవాడు కాదు, పూర్నియా జిల్లా వాసి. స్థానికుల కథనం ప్రకారం, నమిత్ ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదు. పక్క గ్రామానికి విదేశీ అతిథులు వచ్చారని తెలిసి, కేవలం కుతూహలంతో అక్కడికి వెళ్లాడు. ఆ తర్వాత అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
ఇక వీడియోలో ఉన్న మహిళ రష్యన్ కాదు, ఆమె పేరు జూలీ కూడా కాదు. ఆమె పేరు ఆండ్రియా కానలీ. ఆమె బ్రిటన్‌కు చెందిన 'షివియా' అనే స్వచ్ఛంద సంస్థ (NGO) ప్రతినిధి. పూర్నియా జిల్లాలో 'సాథీ' అనే స్థానిక సంస్థతో కలిసి షివియా మహిళా సాధికారత కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అక్టోబర్ 7, 8 తేదీల్లో ఆరుగురు మహిళా ప్రతినిధుల బృందం (ఆండ్రియాతో సహా) క్షేత్రస్థాయి పనులను పరిశీలించేందుకు పూర్నియాకు వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వారికి గులాబీల బొకేతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో తీసిన ఫొటోలు, వీడియోలనే కొంతమంది వక్రీకరించి, ఓ కట్టుకథను అల్లి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
ఈ తప్పుడు ప్రచారంపై 'సాథీ' సంస్థ కోఆర్డినేటర్ అభిషేక్ కుమార్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చినవారు తమ సంస్థ అతిథులని, ఈ ఫేక్ వీడియోల వల్ల తమ సంస్థతో పాటు దేశ ప్రతిష్ఠకు కూడా భంగం వాటిల్లుతోందని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించిన కొన్ని మీడియా సంస్థల తీరును ఆయన తప్పుబట్టారు. ఈ అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని ఆయన స్పష్టం చేశారు.