ఎక్కడ చూసినా 'రణబాలి' ముచ్చటనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎక్కడ చూసినా 'రణబాలి' ముచ్చటనే!

Ranabaali Movie Update
  • 'రణబాలి'గా విజయ్ దేవరకొండ 
  • మూడోసారి ఆయన జోడీ కట్టిన రష్మిక 
  • రేపు విడుదలవుతున్న సినిమా
  • రాయలసీమ నేపథ్యంలో నడిచే కథ 
  • అభిమానులలో పెరుగుతున్న ఆసక్తి  

కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా 'రణబాలి' సినిమాను గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఈ కథా నేపథ్యం .. విజయ్ దేవరకొండ - రష్మిక విలక్షణమైన లుక్ .. అనే చెప్పాలి. సాధారణంగా ఒక కథకు చరిత్ర తోడైనా .. ఒక పోరాటానికి ప్రేమ తోడైనా ఆ కథపై అందరిలో మరింత ఆసక్తి కలుగుతుంది .. కుతూహలం పెరుగుతుంది. అయితే చరిత్ర .. పోరాటం .. ప్రేమ .. అనే ఈ మూడు అంశాలను కలుపుకుంటూ అల్లుకున్న కథగా 'రణబాలి' కనిపిస్తుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, రేపు థియేటర్లలో దిగిపోనుంది. 

రాహుల్ సాంకృత్యన్ ఇంతవరకూ తెరకెక్కించిన సినిమాలను ఒకసారి పరిశీలన చేస్తే, ఎప్పటికప్పుడు ఆయన ప్రయోగాల దిశగా అడుగులు వేయడం కనిపిస్తుంది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ .. వాటిని అందంగా ఆవిష్కరించుకుంటూ వెళ్లిన విధానం తెలుస్తుంది. అలా రూపొందిన సినిమానే 'రణబాలి'గా చెప్పుకోవచ్చు. ఇంతవరకూ విజయ్ దేవరకొండ - రష్మిక రెండు సినిమాలలో నటించినప్పటికీ, ఇది పూర్తిగా భిన్నమైనదిగా చెప్పుకోవలసి ఉంటుంది. పెళ్లి తరువాత వాళ్లు కలిసి చేసిన ఫస్టు మూవీగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 

ఇది ఆంగ్లేయుల కాలంలో .. అంటే 1870లలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన కథగా చెబుతున్నారు. ఆంగ్లేయుల కాలంలో రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన కరవు .. ఆ పరిస్థితులలోను అక్కడి ప్రజల పట్ల వాళ్లు దారుణంగా ప్రవర్తించిన తీరు .. వాళ్ల ధోరణిని ధైర్యంగా ఎదిరించిన ఒక యోధుడి కథగా ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ లుక్ తో విజయ్ దేవరకొండ - రష్మిక ఆకట్టుకుంటున్న ఈ సినిమా, కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Advertisement
Ranabali
Vijay Deverakonda
Rashmika Mandanna
Rahul Sankrityan
Rayalaseema Famine 1870
Telugu Period Drama

More Telugu News