ఆ హోటల్ ఆదాయం రోజుకు రూ.75 లక్షలు.. కేటీఆర్‌పై వెంకట్ బల్మూర్ తీవ్ర ఆరోపణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ హోటల్ ఆదాయం రోజుకు రూ.75 లక్షలు.. కేటీఆర్‌పై వెంకట్ బల్మూర్ తీవ్ర ఆరోపణ

KTR hotel revenue 75 lakhs per day Venkat Balmoor makes serious allegations
  • హోటల్ ఆదాయం రూ.5 కోట్ల నుంచి రూ.175 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్న
  • మంత్రిగా ఎంఎన్సీలను బెదిరించి వ్యాపారం చేశారని ఆరోపణ
  • ఆరోపణలపై చర్చకు సిద్ధమని కేటీఆర్‌కు సవాల్
  • త్వరలో సిరిసిల్ల బాగోతం కూడా బయటపెడతానన్న బల్మూరి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై శాసనమండలి ప్రభుత్వ విప్ వెంకట్ బల్మూర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గతంలో చెప్పినట్టుగానే కేటీఆర్ చీకటి బాగోతాలను వరుసగా బయటపెడుతూనే ఉంటానని, అందులో భాగంగానే ఆయన హోటల్ వ్యాపారానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు. రూ.5 కోట్ల షేర్ విలువ ఉన్న డెక్కన్ సరాయ్ హోటల్ ఆదాయం పదేళ్లలో రూ.175 కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంపై తాను ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయని బల్మూర్ అన్నారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బహుళజాతి సంస్థ (MNC)లను బెదిరించి, తమ కంపెనీలకు చెందిన ఫుడ్, ఈవెంట్స్, మీటింగ్స్ వంటివి తన హోటల్‌లోనే నిర్వహించేలా ఒప్పందాలు చేయించుకున్నారని విమర్శించారు. ఈ ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఇది కేటీఆర్, ఆయన టీమ్ చేస్తున్న నయా దందా అని అభివర్ణించారు. ఆ హోటల్ రోజువారీ ఆదాయం సుమారు రూ.75 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తాను చేసిన ఆరోపణలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బల్మూర్ స్పష్టం చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే తన ఆరోపణలపై స్పందించాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా, త్వరలోనే కేటీఆర్‌కు సంబంధించిన "సిరిసిల్ల చీకటి బాగోతం" కూడా బయటపెడతానని వెంకట్ బల్మూర్ హెచ్చరించారు.
Advertisement
KTR
Venkat Balmoor
Deccan Serai Hotel
BRS
Telangana Politics
KTR Corruption Allegations

More Telugu News