మీరు తింటున్న తేనె స్వచ్ఛమైనదేనా? ఇంట్లోనే తెలుసుకునే 6 పద్ధతులు ఇవే!
- నీటిలో తేనె వేసినప్పుడు అది వెంటనే అడుగుకు చేరడం స్వచ్ఛతకు నిదర్శనం
- బొటనవేలిపై తేనె వేసినప్పుడు అది ప్రవహిస్తే కల్తీ జరిగిందని భావించొచ్చు
- కాగితంపై తేమ వ్యాపించే తీరును కల్తీని గమనించే అకాశం
- తేనెలో స్ఫటికాలు ఏర్పడటం సహజమేనంటున్న నిపుణులు
- అయినప్పటికీ తేనె కల్తీని ఇంట్లోనే కచ్చితంగా గుర్తించడం సాధ్యం కాదంటున్న నిపుణులు
- ప్రయోగశాల పరీక్షలతోనే పూర్తిస్థాయిలో నాణ్యత తెలుసుకోవచ్చు
తేనెను ఆయుర్వేదంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన సహజ ఆహారంగా భావిస్తారు. అయితే మార్కెట్లో కల్తీ తేనె కూడా లభిస్తుండటంతో కొనుగోలు చేసే ముందు దాని నాణ్యతను నిర్ధారించుకోవడం ముఖ్యం. తేనెలో చక్కెర సిరప్లు, మొలాసిస్ వంటి పదార్థాలు కలిసే అవకాశం ఉంది. ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతులతో తేనె నాణ్యతపై ప్రాథమిక అంచనా వేసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలతో తేనె స్వచ్ఛతను కచ్చితంగా నిర్ధారించలేం. అందుకు ప్రయోగశాల పరీక్షలే నమ్మదగిన మార్గం.
1. నీటితో పరీక్ష: ఒక గ్లాసు నీటిలోకి ఒక చెంచా తేనె వేయాలి. తేనె వెంటనే నీటిలో కలిసిపోకుండా అడుగుకు చేరుతుందా గమనించాలి. అయితే తేనె నీటిలో ఎలా కలుస్తుందనే అంశం ఒక్కటే దాని స్వచ్ఛతను నిర్ధారించదు.
2. బొటనవేలిపై తేనె చుక్క: బొటనవేలిపై కొద్దిగా తేనె వేసి అది ఎలా వ్యాపిస్తుందో చూడాలి. చిక్కగా ఉండే తేనె వెంటనే ప్రవహించకపోవచ్చు. పలుచగా ఉండటం తేమ ఎక్కువగా ఉందనే సూచన కావచ్చు. కానీ చిక్కదనం ఒక్కటే స్వచ్ఛతకు కొలమానం కాదు.
3. కాగితంతో పరీక్ష: శుభ్రమైన టిష్యూ పేపర్పై లేదా సాధారణ కాగితంపై కొన్ని చుక్కల తేనె వేయాలి. అది వెంటనే కాగితంలోకి ఇంకుతుందా గమనించాలి. నీరు కలిసిన తేనె త్వరగా తడిని వ్యాపింపజేయవచ్చు.
4. తేనె గడ్డకట్టిందా?: కొంతకాలం తర్వాత తేనెలో చక్కెర స్ఫటికాలు ఏర్పడవచ్చు. దీనిని చూసి తేనె పాడైందని భావించాల్సిన అవసరం లేదు. సహజమైన తేనెలోనూ స్ఫటికాలు ఏర్పడతాయి.
5. వాసన, రుచి గమనించండి: సహజ తేనెలో పూలు, మొక్కలను గుర్తుచేసే మృదువైన సువాసన ఉండవచ్చు. దాని రుచి తేనె సేకరించిన పూల రకాన్ని బట్టి మారుతుంది.
6. ప్యాకెట్పై వివరాలు పరిశీలించండి: తేనె కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, పదార్థాల వివరాలు, తయారీదారు సమాచారం, నాణ్యత ధ్రువీకరణ గుర్తులను పరిశీలించాలి. విశ్వసనీయ విక్రేతల నుంచి కొనుగోలు చేయడం మంచిది. అనుమానం ఉంటే సంబంధిత ఆహార భద్రతా అధికారుల సలహా తీసుకోవచ్చు.