ఇరాన్ యుద్ధంతో ఇంధన సంక్షోభం.. అయినా భారత వృద్ధిరేటును ఎందుకు పెంచారు? ఐఎంఎఫ్ సమాధానమిదే..!
- భారత్ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచిన ఐఎంఎఫ్
- తొలి త్రైమాసికంలో అంచనాలకు మించి వృద్ధి సాధించిందన్న ఐఎంఎఫ్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్
- బలమైన ఆర్థిక పునాదులు భారత్కు కలిసొచ్చాయని వ్యాఖ్య
- ఇంధన సంక్షోభంతోనే రూపాయిపై ఒత్తిడని వివరణ
- మారకపు విలువ ఒక్కటే ఆర్థిక విజయానికి కొలమానం కాదన్న ఐఎంఎఫ్
అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్ ఆ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రశంసించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు, ఆర్థిక క్రమశిక్షణ, భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం ఇందుకు దోహదపడ్డాయని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచినట్లు వెల్లడించారు.
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, సరఫరాపై ప్రభావం పడుతున్నప్పటికీ భారత్ వృద్ధి అంచనాను ఎందుకు పెంచారని బ్యాంకాక్లో గురువారం జరిగిన ఐఎంఎఫ్ వార్షిక సమావేశంలో ఆయనను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి వృద్ధి సాధించిందని శ్రీనివాసన్ వివరించారు. సంక్షోభం ఎదురైన సమయంలో భారత్ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, తగినంత విదేశీ మారక నిల్వలు కలిగి ఉండటం ప్రయోజనం చేకూర్చాయని పేర్కొన్నారు.
మరోవైపు, దేశ వృద్ధి అంచనాలు పెరుగుతున్నప్పటికీ రూపాయి విలువపై ఒత్తిడి, పెట్టుబడుల ప్రవాహం తగ్గడం, చమురు ధరల పెరుగుదలపై ఆందోళనలు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. మారకపు విలువపై ప్రపంచ వడ్డీ రేట్లు, పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే ధోరణి, చమురు ధరలు ప్రభావం చూపుతాయని చెప్పారు. భారత్ చమురు దిగుమతులపై ఆధారపడే దేశం కావడంతో అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ప్రభావం పడిందని వివరించారు.
రూపాయి మారకపు విలువను దేశ ఆర్థిక విజయానికి లేదా వైఫల్యానికి కొలమానంగా చూడకూడదని శ్రీనివాసన్ సూచించారు. బాహ్య ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు మారకపు విలువలో మార్పులు ఒక రక్షణ కవచంలా పనిచేయడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కింపు విధానంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ చేపట్టిన మార్పులను ఆయన స్వాగతించారు. జీడీపీ గణాంకాల ప్రామాణికతను మెరుగుపరిచేందుకు బేస్ ఇయర్ను మార్చడం, ఉత్పత్తి రంగం లెక్కల్లో ఉత్పత్తిదారుల ధరల సూచీ (పీపీఐ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లను ఉపయోగించడం మంచి పరిణామాలని పేర్కొన్నారు. ఈ మార్పులు అంతర్జాతీయంగా అనుసరించే ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు.