జగన్ కేసుల్లో కదలిక.. స్పీడ్ పెంచాలంటూ హైకోర్టులో ఈడీ వాదనలు.. విచారణ 13వ తేదీకి వాయిదా
- జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలన్న ఈడీ
- రోజువారీ విచారణ జరిపి కేసులను త్వరగా తేల్చాలని హైకోర్టుకు వినతి
- జగన్‌తో పాటు నిందితులు రోజూ కోర్టుకు హాజరు కావాలని అభ్యర్థన
- ఇప్పటికే ఉన్న పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న హైకోర్టు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులకు సంబంధించి సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని, జగన్‌తో పాటు ఇతర నిందితులు విచారణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని తన పిటిషన్‌లో అభ్యర్థించింది. 2016 నుంచి 2021 మధ్య కాలంలో తాము దాఖలు చేసిన తొమ్మిది అభియోగపత్రాలపై విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యామ్ కోటేశ్వరరావు, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తుల బదిలీలు, నిందితులు వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం వంటి పరిణామాల వల్ల ఏళ్లుగా విచారణలో ఆశించిన పురోగతి లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక నేరాల తీవ్రతపై సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ఈ కేసుల నేపథ్యాన్ని పరిశీలిస్తే.. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 'క్విడ్-ప్రో-కో' పద్ధతిలో జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వంటి కంపెనీల్లోకి పెట్టుబడులు మళ్లాయన్న ఆరోపణలపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో సీబీఐ 11, ఈడీ 9 చొప్పున ఛార్జిషీట్లు దాఖలు చేశాయి.
ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇదే అంశంపై హరిరామ జోగయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు మరికొన్ని సుమోటో పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేసింది. ఈ తాజా పిటిషన్‌ను కూడా వాటితో కలిపి విచారిస్తామని పేర్కొంటూ, తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది.