హైదరాబాద్ నీటి సరఫరాపై వదంతులు.. క్లారిటీ ఇచ్చిన జలమండలి
- హైదరాబాద్‌లో నీటి కొరతపై వైరల్ అవుతున్న సందేశం అవాస్తవమన్న జలమండలి
- జలమండలి పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- తాము ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని బోర్డు స్పష్టీకరణ
- ఎన్‌నినో ప్రభావంతో జలాశయాలు ఎండిపోతాయన్నది వదంతే
- అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచన
హైదరాబాద్ నగరంలో నీటి సరఫరాపై వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో తమ పేరుతో ప్రచారమవుతున్న సందేశం పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
ఎన్‌నినో ప్రభావం, కరవు పరిస్థితుల కారణంగా నవంబర్ చివరి నాటికి హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే జలాశయాలు ఎండిపోతాయని, దీంతో నగరంలో నీటి సరఫరాను నిలిపివేస్తారని లేదా తీవ్ర ఆంక్షలు విధిస్తారని ఒక మెసేజ్ కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఈ సందేశం జలమండలి జారీ చేసినట్టుగా ఉండటంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.
ఈ ప్రచారంపై స్పందించిన జలమండలి అధికారులు, తాము అలాంటి హెచ్చరికలు ఏవీ జారీ చేయలేదని స్పష్టం చేశారు. వైరల్ మెసేజ్‌లో పేర్కొన్న జలాశయాల నీటిమట్టాలు, సరఫరా పరిస్థితులకు సంబంధించిన సమాచారం అధికారికం కాదని తెలిపారు.
తమ సంస్థ పేరుతో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నీటి సరఫరాకు సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.