పండగ సేల్‌కు అదిరిపోయే ఆరంభం.. రెండ్రోజుల్లోనే రూ. 24,000 కోట్ల వ్యాపారం!
- స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కస్టమర్ల ఆసక్తి
- మొత్తం అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్లదే అగ్రస్థానం
- రెండో స్థానంలో నిలిచిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్
- టైర్-2 నగరాల్లోనూ ఫ్యాషన్ ఉత్పత్తులకు భారీ డిమాండ్
- కొనుగోళ్లతో పండగ కళ
భారత్‌లో పండగ సీజన్ షాపింగ్ సందడి మొదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ వేదికలు ఫెస్టివల్ సేల్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాయి. సేల్ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే సుమారు రూ. 24,000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోళ్లకు వినియోగదారులు భారీగా ఆసక్తి చూపారు.
రెడ్‌సీర్ నివేదిక ప్రకారం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, అజియో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు తొలి రెండ్రోజుల్లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 24,200 కోట్లు) స్థూల సరుకుల విలువను (GMV) నమోదు చేశాయి. ఈ రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 6 నుంచి 6.5 కోట్ల మంది వినియోగదారులు షాపింగ్ చేయగా, 8 నుంచి 9 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు అంచనా. ఈ అమ్మకాల విలువ సాధారణ రోజువారీ వ్యాపారంతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం.
మొత్తం అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్లదే సింహభాగం. మొత్తం జీఎంవీలో 38 నుంచి 40 శాతం వాటాతో ఇవి అగ్రస్థానంలో నిలిచాయి. వీటి విలువ సుమారు రూ. 9,100 కోట్ల నుంచి రూ. 9,600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్మార్ట్‌ఫోన్ల తర్వాత కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రెండో అతిపెద్ద విభాగంగా నిలిచింది. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం 25-27 శాతం వాటాను (రూ. 6,000-6,500 కోట్లు) సొంతం చేసుకుంది. ముఖ్యంగా టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి పెద్ద ఉపకరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. టీవీల విభాగంలో టీసీఎల్, ఎల్జీ, శాంసంగ్, షావోమి వంటి బ్రాండ్లకు చెందిన 55-అంగుళాల మోడళ్లకు అధిక డిమాండ్ కనిపించింది.
మరోవైపు, ఫ్యాషన్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. మొత్తం అమ్మకాల్లో 15-18 శాతం వాటాతో (రూ. 3,630-4,350 కోట్లు) ఈ విభాగం నిలిచింది. ముఖ్యంగా టైర్-2, చిన్న పట్టణాల్లో పండగ దుస్తులకు డిమాండ్ పెరగడంతో, సాధారణ రోజులతో పోలిస్తే అమ్మకాలు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా నమోదయ్యాయి. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే అంచనాలతో వినియోగదారులు ఈ సేల్‌లో కొనుగోళ్లకు మొగ్గుచూపినట్లు నివేదిక విశ్లేషించింది.