'అడవితల్లి బాట'పై పవన్‌కు చంద్రబాబు అభినందనలు
- రూ.2,052 కోట్లతో 'అడవితల్లి బాట 2.0'కు శ్రీకారం
- 1,341 గిరిజన ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం
- డోలీ మోతలకు చరమగీతం పాడటమే ఈ కార్యక్రమ లక్ష్యం
- ఇది గిరిజనుల కష్టాలకు విముక్తి అని చంద్రబాబు వ్యాఖ్య
గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి, వారి దశాబ్దాల కష్టాలకు చరమగీతం పాడే లక్ష్యంతో రూపొందించిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తన స్పందనను పంచుకున్నారు.
‘అడవితల్లి బాట’ తొలి విడత విజయవంతం కావడం, ప్రస్తుతం రెండో దశ ‘అడవితల్లి బాట 2.0’కు శ్రీకారం చుట్టడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ దశలో భాగంగా రూ. 2,052 కోట్ల వ్యయంతో 1,341 గిరిజన ఆవాసాలకు సంబంధించి 1,976 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ఇది కేవలం రోడ్ల నిర్మాణం మాత్రమే కాదని, గిరిజనుల కష్టాల నుంచి విముక్తి కల్పించే మార్గమని, అత్యవసర వైద్య సేవలకు లభించే భరోసా అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలను శాశ్వతంగా దూరం చేసే ఈ కార్యక్రమం ఒక మహత్తర యజ్ఞమని చంద్రబాబు అభివర్ణించారు. ప్రతి గిరిజన గూడెం ప్రధాన రహదారితో అనుసంధానమై, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా సాగుతున్న ఈ కృషి మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.