70 మ్యూల్ అకౌంట్లతో సైబర్ మోసాలు.. హైదరాబాద్‌లో ఇద్దరి అరెస్ట్
- సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
- ఈ ఖాతాల ద్వారా రూ.70 కోట్ల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తింపు
- దేశవ్యాప్తంగా 450 సైబర్ కేసులతో ఈ అకౌంట్లకు సంబంధం
- పాత రూపాయి నోటు మోసం కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన భారీ నెట్‌వర్క్
- కమిషన్ ఆశ చూపి విద్యార్థులు, డెలివరీ బాయ్స్ నుంచి ఖాతాల సేకరణ
సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్లు) సరఫరా చేస్తూ భారీ మోసాలకు సహకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అందించిన సుమారు 70 మ్యూల్ అకౌంట్ల ద్వారా దేశవ్యాప్తంగా 450 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని, వీటిలో రూ.60 నుంచి 70 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని పోలీసులు ఆదివారం వెల్లడించారు. రామాంతపూర్‌కు చెందిన గుమ్మ రమేశ్ (39), ముదలె అనిల్ (19) అనే ఇద్దరిని నిందితులుగా గుర్తించారు.
ఫేస్‌బుక్ ద్వారా పాత రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇస్తామని నమ్మించి, ఓ బాధితుడి నుంచి రూ.7,93,351 వసూలు చేసిన మోసంపై అందిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో భాగంగా దర్యాప్తు చేయగా ఈ భారీ నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66C, 66D లతో పాటు బీఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ డీసీపీ ఎస్. చైతన్య కుమార్ తెలిపారు. తమ సంపాదన సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు నిందితులు చెప్పారన్నారు.
ప్రధాన నిందితుడు రమేష్ గతంలో కర్ణాటకలోని బీదర్‌లో నివసించి, ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌కు వచ్చి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. పరారీలో ఉన్న మరో నిందితుడితో కలిసి రామాంతపూర్ పరిసరాల్లోని విద్యార్థులు, డెలివరీ పార్ట్‌నర్లకు కమిషన్ ఆశ చూపి, వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించాడు. ఇలా సేకరించిన దాదాపు 70 అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులను హరియాణాలోని సైబర్ నేరగాళ్లకు కొరియర్ ద్వారా పంపేవాడు. రెండో నిందితుడైన అనిల్, రమేశ్ నుంచి కమిషన్ తీసుకుని మూడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, వాటి వివరాలను అతనికి అందజేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడితో పాటు ప్రధాన సైబర్ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.