సీఎంకు ఉరవకొండ అభివృద్ధి నివేదిక.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక సూచన
Add ap7am to your home Screen

సీఎంకు ఉరవకొండ అభివృద్ధి నివేదిక.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక సూచన

Chandrababu Naidu receives Uravakonda development report and gives key suggestions to MLAs
  • ఉరవకొండ అభివృద్ధి నివేదికను సీఎం చంద్రబాబుకు అందించిన మంత్రి పయ్యావుల
  • నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలతో పుస్తకం రూపకల్పన
  • అభివృద్ధి పనులపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన
  • గత ప్రభుత్వ విధ్వంసం, తమ ప్రభుత్వ వికాసం మధ్య తేడా చెప్పాలన్న చంద్రబాబు
ఆర్థిక మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని సీఎంకు అందజేశారు.

నియోజకవర్గ ప్రోగ్రెస్ కార్డు తరహాలో ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. ఉరవకొండకు తాగునీటి సరఫరా, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు, కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, నూతన భవనాల మంజూరు వంటి పనుల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు సీఎంకు వివరించారు.

ఈ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి పయ్యావులను అభినందించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయడంతో పాటు, వాటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని అన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వికాసానికి మధ్య తేడాను ప్రజలకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. ఇందుకోసం ఎమ్మెల్యేలందరూ ఇలాంటి నివేదికలు, ప్రోగ్రెస్ కార్డులను ప్రజల ముందు ఉంచాలని అభిప్రాయపడ్డారు.

తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు, లిఫ్ట్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి సహకరిస్తున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రి పయ్యావుల కేశవ్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Payyavula Keshav
Chandrababu Naidu
Uravakonda Development
Andhra Pradesh MLAs
TDP Alliance Government
Amaravati

More Telugu News