చింత చెట్టు కింద కూర్చుని గిరిజనులతో పవన్ కల్యాణ్ మమేకం
- గిరిజన గూడెంలో చింతచెట్టు కింద కూర్చుని ప్రజలతో మమేకమైన పవన్ కల్యాణ్
- రాకోటలో ‘మాటా-మంతి’.. గిరిజనుల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాలు
- పాఠశాలలు, ఆసుపత్రుల కోసం సుమారు రూ. 5 కోట్ల నిధులు మంజూరు
- ‘అడవి తల్లి బాట 2.0’లో భాగంగా రూ. 2.29 కోట్లతో రహదారికి శంకుస్థాపన
- గిరిజనుల సంప్రదాయ స్వాగతం మధ్య పర్యటన సాగించిన ఉప ముఖ్యమంత్రి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం గిరిజన గూడెంలో పర్యటించి, అడవి బిడ్డలతో మమేకమయ్యారు. మారుమూల గ్రామానికి స్వయంగా వెళ్లి, చింతచెట్టు కింద రచ్చబండపై కూర్చుని వారి సమస్యలను ఓపికగా విన్నారు. అక్కడికక్కడే పరిష్కారాలు చూపుతూ, కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ఆదేశాలు జారీ చేసి గిరిపుత్రుల్లో భరోసా నింపారు.
పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గంలోని రాకోట గిరిశిఖర గ్రామంలో ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపే 3.4 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 2.29 కోట్లతో శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఏర్పాటు చేసిన ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాకోటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ విద్య, వైద్య, మౌలిక వసతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ప్రజల వినతులపై తక్షణమే స్పందించిన పవన్ కల్యాణ్, శిథిలావస్థలో ఉన్న రాకోట పాఠశాల పునరుద్ధరణకు రూ. 20 లక్షలు, గ్రామ ఆరోగ్య కేంద్రానికి రూ. 15 లక్షలు, హనుమాన్ ఆలయ అభివృద్ధికి రూ. 20 లక్షలు మంజూరు చేశారు. వీటితో పాటు పరిసర గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి వివిధ పథకాల కింద సుమారు రూ. 5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు గ్రామానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు గిరిజన మహిళలు పూలు చల్లుతూ, హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన స్థానిక ఎంపీపీ పాఠశాలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను కలిసి, ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రైతులకు వ్యవసాయ పనిముట్లను కూడా పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి నేరుగా తమ గ్రామానికి వచ్చి సమస్యలు తీర్చడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.