అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలా? జాగ్రత్త.. సజ్జనార్ హెచ్చరిక!
- ట్యాంక్‌బండ్, చెరువులు, పార్కుల వద్ద కేక్ కటింగ్‌లు చేయొద్దని సూచన
- ట్యాంక్‌బండ్ ప్రమాదంలో చిన్నారి, ఆమె బంధువు మృతి
- రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
- ఇళ్లలో లేదా సురక్షిత ప్రదేశాల్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని సూచన
- ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిషేధించినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి కేక్ కటింగ్‌లు చేయొద్దని స్పష్టం చేశారు. సరదా కోసం చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి, ఆమె బంధువు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారి పుట్టినరోజు వేడుకల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సజ్జనార్ తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌లో ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని, సంబంధిత ప్రభుత్వ శాఖలతోనూ సమీక్ష నిర్వహించామని వెల్లడించారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పాదచారుల రాకపోకలు తక్కువగా ఉండటంతో వాహనాలు వేగంగా వెళుతుంటాయని సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటబెట్టుకుని రోడ్ల మధ్యకు రావడం ప్రమాదకరమన్నారు. పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో నిర్వహించుకోవాలని సూచించారు.
ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిర్వహించడంపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నిషేధాజ్ఞలు ఉన్నాయని గుర్తుచేశారు. పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, వేడుకల కోసం అక్కడికి వచ్చే వారిని వెనక్కి పంపిస్తున్నా, మళ్లీ అర్ధరాత్రి వేడుకలకు వస్తుండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. క్షణకాలపు ఆనందం కోసం విలువైన ప్రాణాలను కోల్పోవద్దని, ఇకపై ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేడుకలు నిర్వహించవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.