ప్రజల విశ్వాసాన్ని ఈసీ కోల్పోతోంది: హరీశ్ రావు
Add ap7am to your home Screen

ప్రజల విశ్వాసాన్ని ఈసీ కోల్పోతోంది: హరీశ్ రావు

Harish Rao says Election Commission is losing peoples trust
  • అధికారంలో ఉన్నవారికి ఈసీ రక్షణ కవచం కాదన్న హరీశ్
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
  • అన్నిటికన్నా ప్రజాస్వామ్యం గొప్పదని వ్యాఖ్య
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల సంఘం (ఈసీ) వెన్నెముక వంటిదని, అది అధికారంలో ఉన్నవారికి రక్షణ కవచంలా మారకూడదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరు, నియామకాలపై వస్తున్న ప్రశ్నలతో రాజ్యాంగ పునాదులు బలహీనపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితా సవరణలో (సర్) భాగంగా పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం వల్లే ఈసీపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. "ప్రజాస్వామ్యం అన్నింటికన్నా గొప్పది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడంలో విఫలమైతే, అందుకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాలి" అని హరీశ్ రావు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 324, 325, 326 ప్రకారం స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగాలని గుర్తుచేశారు.
Advertisement
Harish Rao
Election Commission of India
Gyanesh Kumar CEC
BRS Party
Voter List Deletions
Indian Democracy

More Telugu News