ఫలితాలు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టా?: కిషన్ రెడ్డి
- ప్రజా తీర్పును గౌరవించడం కాంగ్రెస్‌కు అలవాటు లేదన్న కిషన్ రెడ్డి
- రాహుల్ గాంధీ తీరులో ప్రమాదకర ధోరణులు కనిపిస్తున్నాయని విమర్శ
- ఫలితాలు వ్యతిరేకిస్తే రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందని మండిపాటు
కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రజా తీర్పును గౌరవించడం అలవాటు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ పనితీరులో ఒక వింత, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. వారికి అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టా? అని ప్రశ్నించారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే రాజ్యాంగ సంస్థలపై విష ప్రచారం చేస్తారా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయనప్పుడల్లా ఎన్నికల సంఘం, కాగ్, న్యాయవ్యవస్థ, పార్లమెంట్ వంటి రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయడం అలవాటుగా మార్చుకుందని ఆయన ఆరోపించారు. ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, రాజ్యాంగ సంస్థలు అవినీతిమయమయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలకు దిగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ కీలకమైన సంస్థలపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే కాంగ్రెస్ ఇలాంటి ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు.