పుదుచ్చేరి ఉప ఎన్నిక ఫలితం.. రెండో స్థానానికి పరిమితమైన టీవీకే-కాంగ్రెస్‌
Add ap7am to your home Screen

పుదుచ్చేరి ఉప ఎన్నిక ఫలితం.. రెండో స్థానానికి పరిమితమైన టీవీకే-కాంగ్రెస్‌

Ashok Anand wins Puducherry Thattanchavadi by election as TVK Congress alliance finishes second
  • తట్టాంచావడి స్థానాన్ని నిలబెట్టుకున్న అధికార ఏఐఎన్‌ఆర్‌సీ
  • అశోక్‌ ఆనంద్‌కు 8,482 ఓట్ల మెజారిటీ
  • కాంగ్రెస్‌ అభ్యర్థికి 4,876 ఓట్లు, డీఎంకే అభ్యర్థికి 2,664 ఓట్లు
  • సీఎం రంగస్వామి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం
  • ఏఐఎన్‌ఆర్‌సీకి బీజేపీ, అన్నాడీఎంకే మద్దతు, కాంగ్రెస్‌కు టీవీకే మద్దతు
పుదుచ్చేరిలో అధికార ‘ఆల్‌ ఇండియా ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌’ (ఏఐఎన్‌ఆర్‌సీ) తట్టాంచావడి అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి అశోక్‌ ఆనంద్‌ 8,482 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి పార్టీకి ఈ గెలుపు రాజకీయంగా కీలకంగా మారింది.

అశోక్‌ ఆనంద్‌కు 13,358 ఓట్లు పోలవగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఈ. వినయగం 4,876 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి కె.సేతు సెల్వం 2,664 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రంగస్వామి తట్టాంచావడి, మంగళం రెండు స్థానాల నుంచి గెలిచారు. అయితే, ఆయన మంగళం స్థానాన్ని అట్టిపెట్టుకుని తట్టాంచావడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ స్థానాన్ని మళ్లీ తన పార్టీ ఖాతాలో వేసుకోవడంతో అక్కడ రంగస్వామి పార్టీ పట్టు కొనసాగినట్లయింది.

అశోక్‌ ఆనంద్‌ గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ ఎన్నికలో ఆయనకు బీజేపీ, అన్నాడీఎంకే, లక్ష్య జననాయక కచ్చి మద్దతు లభించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి వినయగానికి ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ మద్దతుగా నిలిచింది. దీంతో ఈ పోటీ ప్రధాన పార్టీలతో పాటు ఇతర రాజకీయ శక్తుల మద్దతు కూడిన పోరుగా మారింది.
Advertisement
Ashok Anand
AINRC
N Rangaswamy
Puducherry by election results
Thattanchavadi assembly seat
TVK Congress alliance

More Telugu News